ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మాజీ సీఎం ఆయన. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఆయనే. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నా సరే పదవులు మాత్రం ఆయన వద్దకు రావడానికి ఇష్టపడటం లేదు. రాష్ట్రాన్ని విభజించాలనే అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించి, రాజీనామా చేసిన ఆయన.. సొంత పార్టీ పెట్టారు, మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ పార్టీ మారారు. కానీ ఇప్పటి వరకు గత పదేళ్ళలో ఏ పదవికి నోచుకోలేదు ఆయన.
Also Read : సింగరేణిలో కవితకు షాక్ ఇవ్వడానికి కారణం ఇదేనా..?
ఆయన ఎవరో క్లారిటీ వచ్చే ఉంటుంది కదా…? ఆయనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. సమర్ధ నేతగా మంచి ఇమేజ్ ఉన్న ఆయన, గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీ స్థానానికి పోటీ చేసారు. మిథున్ రెడ్డిపై ఓటమి పాలైన తర్వాత సైలెంట్ అయ్యారు. అక్కడి నుంచి ఆయనకు మంత్రి పదవి వస్తుందని, రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉందని, ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ ఉందని ఎన్నో వార్తలు వచ్చినా.. ఏ ఒక్కటి ఆయన వరకు వెళ్ళలేదు పాపం. ఇప్పుడు మళ్ళీ ఆయన గురించి చర్చ మొదలైంది.
Also Read : కేసీఆర్ కి ఊహించని షాక్ ఇచ్చిన కవిత
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి వచ్చింది. మరి బిజెపిలో ఉన్న తన సంగతి ఏంటీ అంటూ ఆయన ఢిల్లీ ప్రయాణం అవుతున్నట్టు సమాచారం. ఏదోక పదవి కావాలని, లేదంటే తన రాజకీయ జీవితానికి అవమానంగా ఉందంటూ.. ఆయన కేంద్ర పెద్దలను, బిజేపి పెద్దలను కలవడానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఆయన విషయంలో సానుకూలంగానే ఉన్నా.. పార్టీ వేరు కాబట్టి, బిజేపి అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన సోదరుడు ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన కూడా గవర్నర్ పదవి కోసం ఎదురు చూస్తున్నట్టు టాక్. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ స్థానం కోసం కూడా ఎదురు చూసినా అది కాకపోవడంతోనే ఢిల్లీ వెళ్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.




