మన తెలుగులో స్టార్ హీరోల సినిమాలు అంటే వసూళ్ల విషయంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. వందల కోట్ల వసూళ్లు టార్గెట్ పెట్టుకుని హీరోలు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలు 500 నుంచి 1000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ సినిమా తర్వాత నుంచి ఎన్టీఆర్ ఏ సినిమా చేసిన సరే 500 కోట్లు టార్గెట్ అంటూ ప్రచారం మొదలైంది.
Also Read : కూన ఎపిసోడ్‌లో భారీ ట్విస్ట్..!
కానీ వార్ 2 సినిమా విషయంలో మాత్రం ఇది రివర్స్ అయినట్టుగానే కనపడుతుంది. ఈ సినిమా తెలుగు హక్కులను సూర్యదేవర నాగవంశీ తీసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనా వేశారు. తెలుగులో భారీ వసూళ్లు వస్తాయని లెక్కలు వేసుకుని ఎన్టీఆర్ కు లాభాల్లో కూడా వాటా ఇచ్చారు. తీరా చూస్తే సినిమాకు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడం నాగవంశీని నిండా ముంచింది. ఇప్పటికే కింగ్డమ్ సినిమాతో నష్టాల్లో ఉన్న నాగ వంశీ.. ఇప్పుడు ఈ సినిమాతో కూడా నష్టాల్లో మునిగిపోయారు.
Also Read : ఆ విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటో..?
దీంతో ఎన్టీఆర్ కు నాగ వంశీకి మధ్య విభేదాలు వచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో వంశీ, ఎన్టీఆర్ కు ఇచ్చే వాటా కూడా ఇవ్వలేనని చెప్పినట్టు, ఫిలింనగర్ లో ఓ టాక్ నడుస్తోంది. అటు సినిమా నిర్మాత ఆదిత్య చోప్రా కి కూడా ఈ సినిమా షాక్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా బడ్జెట్ ఎక్కువ కావడమే కాకుండా సినిమా ప్రమోషన్ కు కూడా భారీగా ఖర్చు పెట్టాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కు దాదాపు 80 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు. కనీసం 800 నుంచి 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయని బాలీవుడ్ మీడియా లెక్కలు వేసింది. తీరా చూస్తే బొమ్మ రివర్స్ అయింది. ఏది ఎలా ఉన్నా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఈ సినిమా నిర్మాతలను నిండా ముంచిందని చెప్పాలి.