Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

రాహుల్ – కోహ్లీ మధ్య వార్.. సోషల్ మీడియా ఓవరాక్షన్

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య విభేదాలు ఉన్నాయా..? సోషల్ మీడియాలో జరుగుతున్న హడావిడి చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు జనాలు. ఇప్పుడు విరాట్ కోహ్లీకి కేఎల్ రాహుల్ కు మధ్య జరిగిన ఓ సంఘటనను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హైలెట్ చేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా కొంతమంది విరాట్ కోహ్లీపై అసహనం వ్యక్తం చేస్తూ విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : సాక్షిపై సాయిరెడ్డి యుద్ధం..!

తాజాగా బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. రెండు జట్లకు అభిమానులు ఎక్కువగా ఉండటంతో మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో సందడి ఎక్కువగానే నడిచింది. బెంగళూరులో ఢిల్లీ విజయం సాధించినప్పుడు కేఎల్ రాహుల్ ఇది నా హోమ్ గ్రౌండ్ అంటూ ఆర్సిబి యాజమాన్యానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక ఢిల్లీలో ఆర్సిబి గెలిచి ఆ జట్టుకు అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తుందని చాలామంది వెయిట్ చేశారు. చివరకు ఆర్సిబి ఢిల్లీ గడ్డమీద మంచి విజయం సాధించి ఆ జట్టుకు షాక్ ఇచ్చింది.

Also Read : కోహ్లీ.. కార్తిక్ మధ్య ఏం జరిగింది..?

అయితే ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు నిదానంగానే బ్యాటింగ్ చేశారు. దూకుడుగా పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు.. ఆదిలో కాస్త తడబడినట్లు కనపడిన ఆ తర్వాత మాత్రం దూకుడు పెంచింది. ఇక ఇదే సమయంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా కె.ఎల్ రాహుల్ కీపింగ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఏదో కాస్త ఘాటుగానే సంభాషణ జరిగినట్లు వీడియో బయటకు వచ్చింది. అది చూసిన అభిమానులు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని.. విరాట్ కోహ్లీ అందరితో గొడవలు పడతాడు అంటూ తిట్టడం మొదలుపెట్టారు. తీరా చూస్తే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి నవ్వుకుంటూ కనిపించారు. చిన్న చిన్న వాటిని భూతద్దంలో పెట్టి చూసే సోషల్ మీడియా వాళ్ళిద్దరి బాండింగ్ గురించి అవగాహన లేక అనవసరంగా ఏదో ఊహించుకుంటుంది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న జనాలకు కౌంటర్ ఇస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్