తెలుగు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో నేషనల్ లెవెల్ లో తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్.. దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ వసూళ్లు సాధించాడు. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్.. చేస్తున్న వార్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. కెరీర్ లో మొదటిసారి కంప్లీట్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పోర్షన్ కంప్లీట్ అయింది.
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్
ఇక మిగిలిన షూటింగ్ మొత్తం.. హ్రితిక్ రోషన్ మీదనే జరగనుంది. ఇదిలా ఉంచితే.. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. నేడు ఈ సినిమాలో ఎన్టీఆర్ పోర్షన్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయగా దీనికి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరితో పాటుగా.. ఎన్టీఆర్ లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. హిందీలో కూడా ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. అది ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. పాన్ ఇండియా సినిమా కావడం, దానికి తోడు బాలీవుడ్ సినిమా కావడం ఎన్టీఆర్ కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.
Also Read : ఐఎస్ఐ ఏజెంట్ల నిలయంగా నార్త్ ఇండియా
ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయితే మాత్రం ఎన్టీఆర్ ఇక నెగటివ్ రోల్స్ లో కూడా బిజీ కానున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చే సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ ను ఇటీవల హైదరాబాద్ లో మొదలుపెట్టారు మేకర్స్. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. దీని తర్వాత.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో కూడా ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం సందీప్.. ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.