Saturday, September 13, 2025 12:50 AM
Saturday, September 13, 2025 12:50 AM
roots

మలేషియాలో క్యాంప్.. వైసీపీ బిగ్ ఆఫర్..!

ప్రజాక్షేత్రంలో గెలవాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. అయితే అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. చేసిన అరాచకాల వల్ల పోటీ చేస్తే ఓడిపోతామనే భయంతో.. ప్రత్యర్థులను బెదిరించి.. భయపెట్టి.. దాడులు చేసి.. చివరరికి కిడ్నాప్, హత్యలు కూడా చేసేందుకు తెగబడ్డారు. ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యం. అయితే ప్రజాక్షేత్రంలో బొక్కబొర్లా పడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడంతో కేవలం 11 స్థానాలు మాత్రమే రావడంతో.. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే కొంతమంది ప్రజాప్రతినిధులు.. జగన్‌ వెంట ఉంటే.. తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని అసలు నిజం తెలుసుకున్నారు. దీంతో కూటమి పార్టీల్లోకి మారిపోయారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీలు మారటంతో ఇప్పటికే పలు చోట్ల వైసీపీ ఆధిపత్యానికి బ్రేక్ పడింది. తాజాగా విశాఖలో మేయర్ పదవి కూడా వైసీపీ చెయ్యి జారే పరిస్థితి తలెత్తింది.

Also Read : సినిమాని చంపెయ్యకండి.. మీడియాపై నిర్మాత ఫైర్

మూడు రాజధానులంటూ పెద్ద ఎత్తున కబుర్లు చెప్పిన జగన్.. విశాఖను అభివృద్ధి చేస్తామంటూ మాయ మాటలు చెప్పారు తప్ప.. కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదు. దీంతో విశాఖ వాసులు వైసీపీని వ్యతిరేకించారు. ఫలితాల తర్వాత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పగా.. వైసీపీకి ఉన్న 59 మంది కార్పొరేటర్లల్లో 17 మంది టీడీపీలో చేరిపోయారు. అలాగే ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు కూడా టీడీపీకి మద్దతు తెలపడంతో.. టీడీపీ బలం 29 నుంచి 48కి చేరుకుంది. ఇక మరో ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు.. జనసేనలో చేరిపోయారు. దీంతో వైసీపీ బలం 34కు పడిపోగా.. కూటమి బలం ఏకంగా 61కి చేరుకుంది. వైసీపీ కార్పొరేటర్లు పార్టీలు మారుతుండటంతో.. ముందు బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేశారు. బెంగళూరు క్యాంపునకు 27 మందిని తరలించి.. వారి బాధ్యతను మేయర్ హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్లు శ్రీధర్, సతీష్‌‍లకు అప్పగించారు. జీవీఎంసీ మేయర్‌ పీఠం కోసం అవిశ్వాసానికి ముహుర్తం ఖరారు చేశారు అధికారులు.

Also Read : వర్మ కోసం వైసీపీ మైండ్ గేమ్..!

ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విశాఖ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట కుమారిని తప్పించి.. మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు కూటమి నేతలు రెడీ అవుతున్నారు. కౌన్సిల్‌లో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 98. ప్రస్తుతం 97 మంది ఉన్నారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా 14 మంది ఉన్నారు. ఇందులో 2/3 వంతు మెజార్టీ ఉంటేనే అవిశ్వాసం నెగ్గుతుంది. ప్రస్తుతం కూటమికి 72 మంది సభ్యులున్నారు. కానీ మేయర్ సీటు కావాలంటే.. మరో ఇద్దరి మద్దతు అవసరం. ఒకరు సీపీఐ సభ్యుడితో పాటు వైసీపీలో అసంతృప్తులు తమకు ఓటు వేస్తారని ఆశిస్తున్నారు. దీంతో మరో అడుగు ముందుకు వేసిన వైసీపీ… తమ పార్టీ కార్పొరేటర్లను బెంగళూరు నుంచి మలేషియా తరలించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 19న నేరుగా కౌన్సిల్ సమావేశానికి తీసుకువచ్చి ఓటింగ్‌లో పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది. అటు కూటమి నేతలు కూడా తమకు మద్దతు ఇస్తున్న కార్పొరేటర్లను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో… మేయర్ స్థానం ఎవరు దక్కించుకుంటారో తెలియాలంటే.. ఈ నెల 19 వరకు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్