ఏదైనా మంచి జరిగితే.. అది మా వల్లే అని గొప్పగా చెప్పుకోవటం మానవ నైజం. అయితే ఈ విషయంలో వైసీపీ నేతలు మరో అడుగు ముందుకు వేస్తారు. చేయని పనికి కూడా గుర్తింపు వస్తే.. అది మా వల్లే అంటారు.. చేసిన పనిపై విమర్శలు వస్తే మాత్రం.. మేము కాదు చేసిందని ఎదుటి వారి మీద బురద జల్లుతారు. ఇప్పుడు ఇలాంటి వ్యవహారమే ఒకటి ఏపీలో హట్ టాపిక్‌గా మారింది. అదే విశాఖలో కొత్తగా నిర్మించిన గ్లాస్ స్కై వాక్. విశాఖలోని కైలాసగిరి వద్ద ప్రపంచంలోనే ఎత్తైన గ్లాస్ స్కైవాక్ ఏర్పాటు చేశారు. దీని క్రెడిక్ కోసం ఇప్పుడు వార్ నడుస్తోంది.
Also Read : సజ్జలపై జగన్ సీరియస్.. అంతా నీ వల్లే..?
ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామనేది ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతలు చెబుతున్నా మాట. విశాఖను ఐటీ కేరాఫ్ అడ్రస్ చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తే.. పరిపాలన రాజధానిగా ప్రకటించారు వైఎస్ జగన్. అయితే కోర్టు కేసుల కారణంగా 3 రాజధానుల ప్రతిపాదనకు బ్రేక్ పడింది. అయితే రాజధాని ఏర్పాటు సాధ్యం కాకపోయినా.. విశాఖ అభివృద్ధికి ఏవో చేశానని చెప్పుకునే ప్రయత్నం మాత్రం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.
విశాఖ తొలి నుంచి పర్యాటకులకు స్వర్గధామం. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే కైలాసగిరి వద్ద గ్లాస్ స్కై వాక్ నిర్మాణం పూర్తి చేసింది. త్వరలోనే ఇది ప్రారంభం అవుతుందని అంతా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా కూడా దీనిపై స్పందించారు. ఇంత అద్భుతమైన థ్రిల్‌ను తాను త్వరలోనే అనుభవిస్తా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read : నమ్రతా శిరోద్కర్ న్యూ యార్క్ ఫొటోస్
అయితే ఈ వంతెన తమ వల్లే అంటున్నారు వైసీపీ నేతలు, అభిమానులు. 2023లోనే గ్లాస్ స్కై వాక్‌కు జగన్ ఆమోదం తెలిపారని.. అదే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందని గొప్పగా చెబుతున్నారు. దీనికి టీడీపీ నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. జగన్ చేస్ పనులన్నీ ఫ్లోటింగ్ వంతెన మాదిరిగానే ఉంటాయంటున్నారు. ప్రారంభించిన రెండో రోజే అలలకు కొట్టుకుపోయిందని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధమైన గ్లాస్ స్కై వాక్ 2024 డిసెంబర్ నెలలో ప్రారంభమైందని.. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారో తెలుసు కదా అని ప్రశ్నిస్తున్నారు. రుషికొండ చుట్టు కట్టిన ప్యాలెస్ మాదిరిగానే మీ పని తీరు ఉంటుందని.. అది ఎవరికీ పనికి రావని ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి గ్లాస్ స్కై వాక్ క్రెడిట్ కోసం వైసీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు.