Friday, September 12, 2025 01:28 AM
Friday, September 12, 2025 01:28 AM
roots

ధోనీ తప్పించాడు.. సచిన్ అండగా నిలిచాడు..!

భారత క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో కొన్ని విమర్శలు ఉంటాయి. ముఖ్యంగా తన మాట వినరు లేదంటే వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్న ఆటగాళ్ళు అనుకుంటే వాళ్ళను జట్టు నుంచి తప్పించేవాడు అనే ఆరోపణ వినపడేది. ఈ విషయంలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, అప్పటి స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ వంటి వారు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఒకానొక సమయంలో ధోనీ.. సెహ్వాగ్ ను కూడా ఎంతగానో ఇబ్బంది పెట్టాడట.

Also Read : యువతకు మోడీ గుడ్ న్యూస్.. వాళ్లకు రూ. 15000

ఈ విషయాన్ని సెహ్వాగ్ స్వయంగా బయటపెట్టాడు. భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక దేశాల మధ్య 2007-08లో ముక్కోణపు వన్డే సీరీస్ జరిగింది. ఈ సీరీస్ నుంచి సెహ్వాగ్ ను ధోనీ తప్పించాడట. పదమ్‌ జీత్ సెహ్రావత్ యూట్యూబ్ ఛానెల్‌ లో మాట్లాడిన ఈ డాషింగ్ ఆటగాడు సంచలన కామెంట్స్ చేసాడు. “2007-08 సిరీస్‌లో మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు, నేను కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లు ఆడాను, ఆ తర్వాత ఎంఎస్ ధోని నన్ను జట్టు నుండి తప్పించాడు.

Also Read : అప్పుడు నంద్యాల ఇప్పుడు పులివెందుల.. టీడీపీకి సెంటిమెంట్ భయం..?

ఆ తర్వాత కొంతకాలం నన్ను ఎంపిక చేయలేదు. అప్పుడు నేను ప్లేయింగ్ ఎలెవన్‌ లో భాగం కాలేకపోతే మాత్రం వన్డే క్రికెట్ ఆడటంలో అర్థం లేదని నాకు అనిపించింది. అప్పుడు నేను టెండూల్కర్ దగ్గరికి వెళ్లి, ‘నేను వన్డేల నుంచి రిటైర్ కావాలని భావిస్తున్నానని అన్నాను. అప్పుడు సచిన్ ‘లేదు, నేను 1999-2000లో ఇలాంటి స్టేజ్ నే ఎదుర్కొన్నాను, అప్పుడు క్రికెట్ నుంచి బయటకు రావాలి అనుకున్నాను. కష్టాలు వచ్చినప్పుడు నిలబడాలి, ఎమోషన్స్ లో నిర్ణయాలు తీసుకోవద్దని సచిన్ సలహా ఇచ్చాడని సెహ్వాగ్ వెల్లడించాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్