టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి. ప్రస్తుతం జరుగుతోన్న ఇంగ్లాండ్ టెస్ట్ సీరీస్ లో విరాట్ కోహ్లీ లేకపోవడం జట్టుకు మైనస్ అనే చెప్పాలి. అభిమానులు కూడా పెద్దగా మైదానానికి రావడం లేదనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఫిట్నెస్ ఉండి కూడా విరాట్ కోహ్లీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు అనేది ఎవరికీ అర్ధం కాని విషయం. అయితే తొలిసారిగా విరాట్ కోహ్లీ ఈ అంశం గురించి బహిరంగంగా మాట్లాడాడు.
Also Read : స్టార్ హీరోయిన్ ను నిండా ముంచిన పర్సనల్ అసిస్టెంట్
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్, YouWeCan కోసం జరిగిన ఛారిటీ కార్యక్రమంలో, కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ కార్యక్రమంలో క్రిస్ గేల్‌తో సహా కొందరు మాజీ ఆటగాళ్ళు పాల్గొన్నారు. జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో సహా మొత్తం క్రికెట్ జట్టు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రవిశాస్త్రి , సచిన్ టెండూల్కర్ , కెవిన్ పీటర్సన్ , బ్రియాన్ లారా మరియు ఆశిష్ నెహ్రా వంటి దిగ్గజాలు కూడా పాల్గొన్నారు. తాను టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగే సమయం ఆసన్నమైందని.. వయసుకు తగ్గట్టే మనం ప్రవర్తించాలని కామెంట్ చేసాడు.
Also Read : విరాట్ కోహ్లీ లండన్ అడ్రస్ బయటపెట్టేసిన మాజీ క్రికెటర్
ఇక రవి శాస్త్రి గురించి విరాట్ కోహ్లీ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. నిజాయితీగా చెప్పాలంటే, తాను అతనితో కలిసి పని చేయకపోతే… టెస్ట్ క్రికెట్‌లో తన సక్సెస్ సాధ్యం కాదన్నాడు. క్రికెటర్లు తమ కెరీర్‌లో ఎదగడానికి అటువంటి సహకారం ఎంతో అవసరమన్నాడు. తొలినాళ్లలో తనను కాపాడి, తాను క్రికెటర్‌గా ఎదగడానికి సహాయం చేసినందుకు కోహ్లీ మరోసారి శాస్త్రికి కృతజ్ఞతలు తెలిపాడు. భారత జట్టులో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న తన తొలి రోజులను విరాట్ గుర్తుచేసుకున్నాడు.