Tuesday, October 28, 2025 05:59 AM
Tuesday, October 28, 2025 05:59 AM
roots

కోహ్లీ ఫిట్నెస్ కు ఓ దండం..!

టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. ఫార్మాట్ కు తగ్గట్టు ఆడే విరాట్ కోహ్లీ.. ముఖ్యంగా వన్డే ఫార్మాట్ లో దుమ్ము రేపుతూ ఉంటాడు. ఇక ఇదే సమయంలో అతని ఫిట్నెస్ కూడా సంచలనం అవుతుంది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ చేశాడు. అందులో కేవలం 26 పరుగులు మాత్రమే అతను బౌండరీలు ద్వారా సాధించాడు. మిగిలిన పరుగులు అన్నీ సింగిల్స్, డబల్స్ రూపంలోనే వచ్చాయి. అంటే దాదాపుగా మ్యాచ్ మొత్తం ఫీల్డ్ లో ఉన్నట్లే. దుబాయ్ లో ఉండే తేమతో ఉండే వాతావరణంలో అంతసేపు ఫీల్డ్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఫిట్నెస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Also Read : రాజ్యసభ సీటుపై కూటమి సంచలన నిర్ణయం…?

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ 84 పరుగులు చేయగా.. అందులో 20 పరుగులు మాత్రమే బౌండరీలు రూపంలో వచ్చాయి. మిగిలిన పరుగులు అన్ని సింగిల్స్ రూపంలోనే విరాట్ కోహ్లీ తీయడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఆస్ట్రేలియా మ్యాచ్ లో కూడా 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత ఓపెనర్లు తక్కువ పరుగులకు అవుట్ కావడంతో.. భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే క్రీజ్ లోకి వచ్చిన ఈ స్టార్ ఆటగాడు చివరి వరకు అదే దూకుడు చూపించాడు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఫీల్డింగ్ జట్టు పై ఒత్తిడి పెంచుతూ.. టార్గెట్ ని తగ్గించుకుంటూ వచ్చాడు. దుబాయ్ లాంటి వాతావరణంలో ఎక్కువ సింగిల్స్, డబుల్స్ తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

Also Read :జగన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన జనసేన..!

ఇక విరాట్ కోహ్లీ పేరిట ఓ రికార్డు కూడా ఉంది. 2000 సంవత్సరం తర్వాత ఒక బ్యాట్స్మెన్ వన్డే క్రికెట్లో సింగిల్స్ రూపంలో 5000 పరుగులు చేసిన ఒకే ఆటగాడు విరాట్ కోహ్లీ. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన ఏమాత్రం అలసిపోకుండా వెంటనే బ్యాటింగ్ కు వచ్చే సింగిల్స్, డబుల్స్ రూపంలో జట్టుకు విలువైన పరుగులు అందిస్తున్న.. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ చూసి స్టార్ ఆటగాళ్లు కూడా షాక్ అవుతున్నారు. 36 ఏళ్ల వయసులో కూడా విరాట్ కోహ్లీ ఆ రేంజ్ లో ఫిట్నెస్ మైంటైన్ చేయడం కొసమెరుపు. ఇక అంతర్జాతీయ స్థాయిలో క్రిస్టియానో రోనాల్డో, విరాట్ కోహ్లీ, లియోనల్ మెస్సి సహ కొంతమంది ఆటగాళ్లు మాత్రమే ఈ రేంజ్ లో ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్నారు. ఇక టీమిండియాలో కేఎల్ రాహుల్ కూడా 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన సరే బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్