టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు భారత క్రికెట్ లో అత్యంత ప్రభావం చూపిన ఆటగాళ్ళలో ఒకడైన విరాట్ కోహ్లీ.. గత ఏడాది కాలంగా ఇబ్బంది పడుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో పర్వాలేదు అనిపించినా విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సీరీస్ లో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. దాదాపు 7 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రన్ మెషీన్.. ఆస్ట్రేలియాపై పెద్దగా ప్రభావం చూపలేదు.
Also Read : లక్షయ్య నాయుడుకి చేసిన న్యాయమే భవిష్యత్తులో అందరికీ చేస్తారా
మొదటి మ్యాచ్ లో డకౌట్ కావడంపై విమర్శలు వచ్చాయి. ఇక రెండవ మ్యాచ్ లో కూడా కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఇక అవుట్ అయిన తర్వాత కోహ్లీ.. మైదానం నుంచి వెళ్తున్న సమయంలో.. ఓ చేతితో అభివాదం చేస్తూ వెళ్ళాడు. దీనితో అది ఫేర్ వెల్ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపించాయి. కానీ ఆ సమయంలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టడంతో కోహ్లీ వారికి థాంక్స్ చెప్పి ఉండవచ్చు అనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. కానీ అనలిస్ట్ లు, క్రికెట్ వర్గాలు మాత్రం కోహ్లీ రిటైర్ అవుతున్నట్టు కామెంట్ చేసారు.
Also Read : నా బెదిరింపులకు భారత్ భయపడింది.. ట్రంప్ సంచలనం
అయితే ఆ కాసేపటికి విరాట్ కోహ్లీ నెట్స్ లో కనిపించాడు. ఒక్కడే ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో అతను రిటైర్ కావడం లేదనే క్లారిటీ వచ్చింది. ఇక విరాట్ కోహ్లీ వన్డేల్లో 14,234 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంచితే ఇప్పటికే యశస్వీ జైస్వాల్ ను టీం యాజమాన్యం ఆస్ట్రేలియా పిలిచింది. దీనితో కోహ్లీ రిటైర్ అయ్యే అవకాశం ఉందని, గిల్ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చని భావిస్తున్నారు.