ఆంధ్రప్రదేశ్ లో వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎవరిని అదుపులోకి తీసుకుంటారో అర్థం కాక వైసిపి నేతల్లో అలాగే అప్పట్లో ఆ పార్టీ నేతలకు సహకరించిన అధికారుల్లో ఆందోళన మొదలైంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత పరిణామాలు కాస్త వైసీపీకి కఠినంగా మారుతున్నాయి. సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు తర్వాత అధికారులు మరింత దూకుడు పెంచారు. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజిని కూడా అరెస్టు అయ్యే అవకాశం ఉందని భావించారు.
Also Read : అందుకే దువ్వాడపై వేటు.. ఆ మాటే జగన్‌కు నచ్చలేదు..!
ఇంకా ఇదిలా ఉంటే ఇప్పుడు కీలక నిందితులందరూ విజయవాడ జైలుకు క్యూ కడుతున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత మద్యం కుంభకోణంలో అత్యంత కీలకంగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా విజయవాడ జైల్లోనే ఉన్నారు. తాజాగా మద్యం కేసులో అరెస్ట్ అయిన మరో నిందితుడు చాణక్య కూడా విజయవాడ జైల్లోనే రిమాండ్ లో ఉన్నారు. అలాగే మాజీ నిఘా విభాగం అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా విజయవాడ జైలుకే తరలించారు అధికారులు.
Also Read : అరెస్టు లిస్టు సిద్దం.. వైసీపీలో మొదలైన అలజడి
వీరందరి పై గతంలో ఉన్న ఆరోపణలను పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఇక లిక్కర్ కుంభకోణంలో ఇతర వ్యక్తులను కూడా అరెస్టు చేస్తే వారిని కూడా విజయవాడ జైలుకే తరలించే అవకాశాలు ఉన్నాయి. అటు వల్లభనేని వంశీ అనుచరులు కూడా కొంతమంది విజయవాడ జైల్లోనే ఉన్నారు. ఇటీవల అరెస్టయినా హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనతోపాటుగా రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కూడా అదే జైల్లో ఉన్నాడు. మరి తర్వాత ఎవరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారో చూడాలి.