ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో వెలుగులోకి వస్తున్న విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తవ్వుతున్న కొద్దీ విస్మయం కలిగించే అంశాలు దర్యాప్తులో బయటపడుతున్నాయి. తాజాగా మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మద్యం స్కాంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ నేతలు.. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. నంద్యాలలోని ఎస్‌పీవై ఆగ్రో డిస్టిలరీని తమ నియంత్రణలోకి తీసుకునేందుకు మోసపూరిత వ్యవహారాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడి అయింది.
Also Read : వందేళ్ల పండుగకు పసందైన విందు..!
విజయసాయిరెడ్డి బంధువులైన పెనక రోహిత్‌రెడ్డి, శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన ట్రైడెంట్ ఛాంబర్స్ లిమిటెడ్, శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించారని సిట్ గుర్తించింది. ఇలా 30 కోట్లను శిష్ట్‌లా శ్రీనివాస్‌కు చెందిన శాన్‌హోక్ ల్యాబ్స్‌కు బదిలీ చేసి అక్కడ్నుంచి డికార్ట్ లాజిస్టిక్స్‌లోకి పంపినట్టు తేల్చారు. అనంతరం ఈ డబ్బును ఎస్‌పీవై ఆగ్రో డిస్టిలరీకి డికార్ట్ సంస్థ నుంచి పెట్టుబడిగా మళ్లించి సుప్రీం బ్లెండ్ బ్రాండ్ మద్యం ఉత్పత్తి చేయించినట్టు ఆధారాలతో సహా పట్టుకున్నారు. నిధుల లావాదేవీల వివరాలను సైతం విచారణ బృందాలు సేకరించినట్టు తెలుస్తోంది.
Also Read : బీజేపీని ఆడేసుకుంటున్న కాంగ్రెస్.. సెల్ఫ్ డిఫెన్స్ లో ఫెయిల్..?
ఎస్‌పీవై ఆగ్రోలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఆర్జించినట్లు చూపిన రోహిత్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి అనంతరం వీటిని డికార్ట్ లాజిస్టిక్స్‌లోకి మళ్లించారని అధికారులు గుర్తించారు. ముడుపుల రూపంలో రాజకీయ నేతలకు లబ్ధి కల్పించేందుకు ఈ రకమైన ముసుగులు తొడిగారని తెలుస్తోంది. డికార్ట్ నుంచి నిధుల మళ్లింపు లక్ష్యంగా ఈశ్వర్ కిరణ్ కూడా టెక్కార్ ఇన్నోవేషన్స్, టెక్కార్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ అనే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారని వెల్లడి అయింది. బేవరేజెస్ కార్పొరేషన్ అమ్మకాల సమాచారం మొత్తాన్ని ఈశ్వర్ కిరణ్ కుమార్‌రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రైవేటు ఏజెన్సీ నుంచి తీసుకున్నారని.. వాటి ఆధారంగా మద్యం మాఫియాకు అందాల్సిన సొమ్మును లెక్కించి సరైన సమయంలో వాటిని రాజ్ కెసిరెడ్డికి అందడంలో సహకరించారని తేల్చారు.




