వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాను ఉప రాష్ట్రపతి ఆమోదించారు. ఈ రోజు ఉదయం ఆయన రాజీనామా చేయగా ఆ రాజీనామాకు వెంటనే ఆమోద ముద్ర వేసారు. అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. లండన్ లో ఉన్న వైసీపీ అధినేత జగన్ తో మాట్లాడిన తర్వాతనే.. రాజీనామా చేసానని విజయసాయి తెలిపారు. ఒకసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాలు మాట్లాడకూడదని.. భవిష్యత్ లో రాజకీయాలపై మాట్లాడనని స్పష్టం చేసారు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ.. ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను రాజీనామా చేస్తే మరింత బలవంతులు రాజకీయాల్లోకి వస్తారనిపించి రాజీనామా చేశారని పేర్కొన్నారు.
Also Read: వైసీపీకి ట్రబుల్ షూటర్స్ షాక్..!
పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేస్తానన్నారు విజయసాయి. నేను ఏ రోజూ అబద్దాలు చెప్పలేదని… వెంకటేశ్వరస్వామిని నమ్ముకున్న వ్యక్తిగా తాను అబద్దాలు చెప్పను అని స్పష్టం చేశారు. మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. వైఎస్ కుటుంబంతో విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. అప్రూవర్ గా మారాలని ఒత్తిడి వచ్చినా మారలేదన్నారు విజయసాయి. కేవీ రావుతో తనకు ఎలాంటి సన్నిహిత సంబంధాలు, వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టం చేసారు. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవని.. బెంగుళూరులో ఒక ఇల్లు, విజయవాడ లో ఒక ఇల్లు, విశాఖలో ఒక ఫ్లాట్ మాత్రమే ఉన్నాయని విలేఖరులని ఆశ్చర్యపరిచారు.
Also Read: షాక్ ఇవ్వడానికి బొత్సా రెడీ..?
నా పిల్లలపై ప్రమాణం చేసి చెబుతా.. కాకినాడ సీపోర్టు వ్యవహారం గురించి తనకు తెలియదన్నారు సాయి రెడ్డి. వైఎస్ వివేకా ఘటనపై స్పందించిన విజయసాయిరెడ్డి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యాను అన్నారు. వెంటనే అవినాష్‌రెడ్డికి ఫోన్ చేసి అడిగానని తెలిపారు. అవినాష్ మరో వ్యక్తికి ఫోన్ ఇవ్వగా గుండెపోటుతో వివేకా చనిపోయినట్టు నాకు చెప్పారన్నారు. ఫోన్‌లో వచ్చిన సమాచారమే మీడియాకు చెప్పా అంటూ వివరించారు. విజయసాయి వ్యాఖ్యలతో వైఎస్ వివేక కేసు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. వైఎస్ వివేక గుండెపోటుతో చనిపోయారని విజయసాయి కి చెప్పిన వ్యక్తి ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు విస్తృతంగా చర్చల్లోకి వస్తుంది.
Also Read: ఏపీలో పవన్.. తెలంగాణలో బీజేపి.. ఇదేంటి..!
ఇక తన ఒంట్లో అసలు భయం అనేదే లేదన్నారు సాయి రెడ్డి. నా రాజీనామాతో కూటమికే లబ్ధి అని, వైసీపీకి నష్టం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి పదవులు ఆశించి రాజీనామా చేయలేదని, కేసులు మాఫీ చేస్తారనీ రాజీనామా చేయలేదని వివరణ ఇచ్చారు. ఇప్పటికే ఎన్నో కేసులను ఎదుర్కొన్నానని.. ఇకముందు కూడా ఎదుర్కుంటారని పేర్కొన్నారు. గవర్నర్ పదవి కానీ.. బీజేపీలో చేరడంలాంటిది కానీ ఏమీలేదని, విజయసాయిరెడ్డి విశాఖను దోచేశారనే ఆరోపణల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. నా కుమార్తె, అల్లుడికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, వారి ఆస్తులు నాకు ఆపాదిస్తే నేను చేసేదేమీ లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.