కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ సినీ రంగంలోకి అడుగుపెడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా స్టార్ హీరోల వారసులు హీరోలుగా అరంగేట్రం చేసి తండ్రి వారసత్వాన్ని కొనసాగించే దిశగా ముందుకు సాగుతుంటారు. అయితే జాసన్ సంజయ్ మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ హీరోగా కాకుండా దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించడానికి సిద్ధమవడం కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చలకు దారితీసింది.
Also Read : విజయ్ దళపతికి అమెజాన్ బిగ్ షాక్..!
జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం “సిగ్మా”. ఈ సినిమాలో హీరోగా సందీప్ కిషన్ నటిస్తుండగా, హీరోయిన్‌గా ఫారియా అబ్దుల్లా కనిపించనున్నారు. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కేథరిన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్, అన్బు థాసన్, శివం పండిత్, యోగ్ జాపీ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జెన్-జీ శైలిలో కొత్త తరహా యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని జాసన్ సంజయ్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకోవడంతో సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇదిలా ఉంటే, సినిమాలో ఒక ప్రత్యేక పాటను కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పాటను సందీప్ కిషన్ మరియు కేథరిన్ త్రెసాపై చిత్రీకరించనున్నారని చెబుతున్నారు. అయితే ఈ స్పెషల్ సాంగ్‌లో జాసన్ సంజయ్ కూడా చిన్న ప్రత్యేక ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ఆయన తెరపై కూడా కనిపించనున్నాడనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Also Read : పెళ్లిపీటలెక్కనున్న అనుష్క.. ఈసారి నిజంగానే..?
ఈ పరిణామాల నేపథ్యంలో జాసన్ సంజయ్ భవిష్యత్‌పై కోలీవుడ్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ముందుగా దర్శకుడిగా తనను తాను నిరూపించుకుని, ఆ తరువాత హీరోగా రంగప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నాడా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తండ్రి విజయ్ లెగసీని కొనసాగిస్తూ హీరోగా ఎంట్రీ ఇస్తాడా, లేక పూర్తిగా దర్శకుడిగానే కొనసాగుతాడా అన్నది మాత్రం రాబోయే రోజుల్లో తేలనుంది. ఇదే సమయంలో ఇటీవల వచ్చిన ‘ఊరి పేరు భైరవకోన’ తరువాత మరో విజయాన్ని అందుకోవాలని సందీప్ కిషన్ కూడా ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు.

