లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయాడు అనేది గత పదేళ్లుగా ఇండియన్ మీడియాలో కనీసం నెలరోజులకు ఒకసారి అయినా వినపడే వార్త. సామాన్య ప్రజల్లో విజయ్ మాల్యా ఓ దోషిగా మిగిలిపోయారు. సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ గా.. కింగ్ ఫిషర్ సంస్థను అన్ని విధాలుగా లాభాల్లో ముందుకు నడిపిన విజయ్ మాల్యా.. 9000 కోట్లు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయారు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఎనిమిదేళ్ల క్రితం దేశంలో రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టించింది ఈ వ్యవహారం.
Also Read : శత్రువులుగా మారిన మిత్రులు..!
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు ఉందని బిజెపి.. బిజెపి తప్పు ఉందని కాంగ్రెస్ పార్టీ.. తీవ్ర ఆరోపణలు చేశాయి. 9 ఏళ్ల నుంచి దేశంలో అడుగుపెట్టని విజయ్ మాల్యా మొట్టమొదటిసారి యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఆ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు ఆయన వెల్లడించారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, లిక్కర్ ఎలా పతనమైందో.. అందులో తన పాత్ర ఏంటో ఆయన స్పష్టంగా వివరిస్తూ.. తన వద్ద నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రికవరీ చేసుకుందో ఆధారాలతో సహా బయటపెట్టారు.
Also Read : 180 మీటర్లకే ఓలా బుక్ చేసుకున్న యువతి.. కారణం తెలిస్తే షాక్
అసలు 9 వేల కోట్లు తాను ఎక్కడా రుణం తీసుకోలేదని… తాను ఆరు వేల కోట్లు పైన రుణం తీసుకుంటే తన వద్ద నుంచి 14 వేల కోట్లకు పైగా రికవరీ చేశారని విజయ మాల్యా ఆధారాలతో సహా వివరించారు. 9000 కోట్లు అనే మాట కేవలం మీడియా సృష్టి మాత్రమేనని విజయ్ మాల్యా కొట్టిపారేశారు. తన వద్ద రికవరీ చేసుకున్న సొమ్ము గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో చేసిన ప్రసంగాన్ని ఆయన చూపించారు. తాను అప్పటి పరిస్థితిని నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి వివరించానని.. కానీ తన వాదన ప్రణబ్ ముఖర్జీ వినలేదని అక్కడి నుంచి తన సంస్థలకు సమస్యలు మొదలయ్యాయని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
Also Read : చేరికలపై చంద్రబాబు సంచలన నిర్ణయం
తన తండ్రి మరణం తర్వాత 28 ఏళ్ల వయసులో తాను.. బాధ్యతలు చేపట్టానని.. ఆ సమయానికి అనిల్ అంబానీ గాని లేదంటే ప్రస్తుతం ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు ఎవరు తమ సంస్థల పూర్తి బాధ్యతలు చేపట్టలేదని వివరించారు. ఇక తాను దేశం విడిచి వెళ్లిపోయాను అనేది పెద్ద అబద్ధం అంటూ విజయ మాల్యా కొట్టి పారేశారు. తాను 32 ఏళ్లుగా యూకే లో శాశ్వత నివాసతుడుగా ఉంటున్నానని.. 180 రోజులు మాత్రమే భారత్ లో ఉండే అవకాశం తనకు ఉందని.. తాను దేశం విడిచి వెళ్లే ముందు అప్పటి కేంద్ర మంత్రులకు కూడా స్పష్టంగా చెప్పానని.. అలాంటప్పుడు తన దేశం విడిచి పారిపోయాను ఎలా అంటారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితికి కేవలం భారత మీడియానే కారణమని.. దేశంలో వ్యాపారం చేయడానికి ప్రభుత్వమే ఒక పెద్ద సవాల్ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : తండ్రీ, కొడుకుల అరెస్టుకు రంగం సిద్ధం..? ఎమ్మార్వోకి మూడింది..?
తన వద్ద నుంచి కేంద్ర ప్రభుత్వం రికవరీ చేసుకున్న సర్టిఫికెట్లను కూడా ఆయన ఇంటర్వ్యూలో చూపించారు. తాను సొంతగా ఏ ఒక్క రూపాయి రుణం తీసుకోలేదని కేవలం తన సంస్థలకు మాత్రమే రుణం తీసుకోవాల్సి వచ్చిందని.. ఆ రుణంలో తాను ఎక్కడ ఎంజాయ్ చేయలేదని వ్యాఖ్యలు చేశారు. తన సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారందరూ లాభాలు పొందారని కానీ తనను దోషిగా భారత మీడియా చూపించిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాలో ఆల్కహాల్ బిజినెస్ కు తాను ప్రాణం పోసానని లెక్కలతో సహా వివరించారు మాల్యా. ఇక తనకు దైవభక్తి ఎక్కువ అని పలు దేవాలయాలకు తాను ఏమేం విరాళం ఇచ్చానో కూడా ఆయన వివరించారు. ఈ ఇంటర్వ్యూకు ప్రస్తుతం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక్కరోజులోనే కోటి 50 లక్షలు మందికి పైగా వీక్షించారు.