చాలా రోజుల నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని పట్టుదలగా కనబడుతున్నాడు. ప్రస్తుతం కింగ్డమ్ అనే సినిమాలో నటిస్తున్న విజయ్ ఈ సినిమా షూటింగ్లో రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. సాధారణంగా గతంలో ఒక సినిమా సైన్ చేసిన తర్వాత ఆ సినిమా కంప్లీట్ అవ్వకుండానే మరో సినిమాపై ఫోకస్ పెట్టి చేస్తున్న సినిమాను లైట్ తీసుకుంటాడు అనే ఆరోపణలు అతనిపై ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం విజయ్ దేవరకొండ రూట్ మార్చాడు.
Also Read : డైరెక్టర్ గా మారుతున్న స్టార్ హీరో
కింగ్డమ్ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్న ఈ యంగ్ హీరో కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో పక్కగా స్పెషల్ మూవీ గా నిలిచిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే తమిళంలో సూర్య సినిమాతో గొంతు కలిపాడు. ఇక హిందీలో రణబీర్ కపూర్ పవర్ ఫుల్ వాయిస్ తో ఈ సినిమా కోసం తాను సైతం సిద్ధం అన్నాడు. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మే నెలలో ఎలాగైనా సరే సినిమాను రిలీజ్ చేయాలని డైరెక్టర్ టార్గెట్ పెట్టుకున్నాడు.
Also Read : కొలికిపూడి అల్టిమేటం.. అసలు గొడవేంటి..?
ఇక లేటెస్ట్ గా ఒక ఈవెంట్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో వాయిస్ ఓవర్ చెప్పించాలని ముందే డిసైడ్ అయ్యామని అన్నాడు. ఎన్టీఆర్ తప్ప వేరే ఎవరు కూడా సినిమాకు న్యాయం చేయలేరని తాను బలంగా నమ్మానని అందుకే డైరెక్టర్ లేకుండానే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పేసాడని కామెంట్ చేశాడు. తనతో ఎన్టీఆర్ చాలా ప్రేమగా మాట్లాడాడని.. అది తన జీవితంలో మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చాడు.




