తమిళ సినిమా డైరెక్టర్ లు.. మల్టీ స్టారర్ సినిమాల విషయంలో ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో సూపర్ హిట్ సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా రజనీ కాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కూడా దాదాపు అదే బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. ఇక ఇప్పుడు మరో సినిమాను లోకేష్.. రజనీ కాంత్ తో ప్లాన్ చేస్తున్నట్టు టాక్. కమల్ హాసన్, రజనీ కాంత్ కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చే ఛాన్స్ కనపడుతోంది.
Also Read : ఇక నా వల్ల కాదు.. ఫ్రీ సర్వీస్ ప్లీజ్..!
అన్నీ అనుకున్నట్టు జరిగితే, తమిళ సినిమాకి రెండు స్తంభాలుగా నిలిచిన రజనీకాంత్, కమల్ హాసన్ 46 సంవత్సరాల తర్వాత తిరిగి కలిసే అవకాశం ఉందని తమిళ మీడియా పేర్కొంది. ఈ చిత్రంలో రజనీకాంత్ మరియు కమల్ హాసన్ వృద్ధ గ్యాంగ్‌స్టర్లుగా నటించనున్నట్లు తమిళ మీడియా వెల్లడించింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కోవిడ్ మహమ్మారికి ముందే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వాయిదా వేసారు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం కనపడుతోంది.
Also Read : ఆ ఇద్దరి కోసం పంత్ కెప్టెన్సీ వదులుకున్నాడా..?
ఇంకా సినిమాకు టైటిల్ ఖరారు కాకపోయినా.. భారీ బడ్జెట్ తో చేయబోతున్న ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించే అవకాశం ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ‘అపూర్వ రాగంగల్’, ‘మూండ్రు ముడిచు, ‘అవర్గళ్’, ‘పతినారు వాయతినిలే’ మరియు ‘నినైతాలే ఇనిక్కుం’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అల్భుత విలక్కుం’ లో సినిమాలో ఇద్దరూ చివరి సారిగా కలిసి నటించారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకే తెరపై ఇద్దరినీ చూపించానున్నాడు లోకేష్.