Friday, September 12, 2025 09:01 PM
Friday, September 12, 2025 09:01 PM
roots

రెచ్చిపోతున్న వెంకట్రామిరెడ్డి.. బాబు సర్కార్ ని అవమానించడమేనా?

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి చేసిన హడావుడి అంతా కాదు. ఏకంగా ఎన్నికల్లో వైసిపి తరఫున ప్రచారం కూడా నిర్వహించిన వెంకట్రామిరెడ్డిని అప్పట్లో ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ ఆయన హడావిడి చేయడం మొదలుపెట్టారు. తాడేపల్లిలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించగా సమావేశానికి హాజరైన వెంకటరామిరెడ్డి ఉద్యోగులకు కొన్ని కీలక సూచనలు సలహాలు చేశారు.

Also Read : చంద్రబాబు వ్యాఖ్యలపై కేడర్ అసంతృప్తి..!

ఉద్యోగులను ఎవరైనా ఇబ్బందులు పెడితే వారి పేర్లు రాసి పెట్టుకోవాలని.. అలాంటివారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక సమీక్ష సమావేశాల్లో దిగువ స్థాయి అధికారులను పై అధికారులు తీడుతున్నారని.. టిడిపి కార్యకర్తలు వస్తే టీ ఇచ్చి గౌరవంగా కూర్చోబెట్టి పనిచేసే పంపాలని లేకుంటే మీ సంగతి చూస్తామని మంత్రుల నుంచి వార్నింగ్ వస్తున్నాయని… ఉద్యోగులను గౌరవించే చర్యలు కనపడటం లేదంటూ ఆయన కామెంట్ చేశారు. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులతో తెల్లవారుజామున చీకట్లో ప్రజల ఇళ్లకు వెళ్లి తలుపు తట్టి నిద్రలేపే ఫించను పంపిణీ చేయిస్తున్నారని ఇంతకంటే ఘోరం మరొకటి లేదంటూ ఆయన మరో కామెంట్ చేశారు.

ఇక ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం ఇంతేనా అంటూ కాస్త ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ మీడియాలో కాస్త వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి గతంలో ఉద్యోగులను నానా రకాలుగా వేధించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా టీచర్లను వైన్ షాపుల వద్ద నిలబెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాగే పింఛన్ల విషయంలో వాలంటీర్లను ఏ విధంగా వేధించారు అనేది అనేక ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. చాలామంది కర్ణాటక వెళ్లి కూడా పెన్షన్లు ఇచ్చి వచ్చారు.

Also Read : ఇండియాలో స్టార్ లింక్ పని చేస్తుందా..? అలెర్ట్ అయిన ఆర్మీ…!

రాయలసీమలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వెళ్లి పెన్షన్లు ఇచ్చిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఏకంగా పెళ్లి బట్టలతో వెళ్లి పెన్షన్ ఇచ్చిన పరిస్థితి గతంలో ఉండేది. అయితే ఇవన్నీ ఉద్యోగులకు గుర్తున్నాయి. ఇప్పుడు వాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న వెంకట్రామిరెడ్డి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోకపోవడం పట్ల పెద్ద రచ్చె జరుగుతుంది. మొన్నామధ్య ఆయన ఏదో ఉద్యోగులకు మద్యం తో పార్టీ ఇచ్చారని హడావుడి చేసే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత వదిలిపెట్టారు.

అప్పట్లో ఆయన పెద్దపెద్ద సెక్షన్లు కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని హడావుడి కూడా జరిగింది. కానీ ఎటువంటి సెక్షన్లు ఆయనపై నమోదు కాలేదు. ఇక ఇప్పుడు ఏకంగా ఉద్యోగులను భయపెడితే పేర్లు రాసుకోవాలంటూ లేని విషయాలను ప్రస్తావిస్తూ వార్నింగ్లు ఇవ్వటం మొదలుపెట్టారు వెంకటరామిరెడ్డి. ఇది చూస్తున్న టీడీపీ క్యాడర్.. రెడ్ బుక్ లో ఈయన గారి పేరు లేదేమో అంటూ సెటైర్ లు వేస్తున్నారు. నన్ను ఏమీ పీకలేరు అనే ధీమాతోనే వెంకట్రామి రెడ్డి ఉన్నట్టు కనపడుతోంది మరి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్