Tuesday, October 21, 2025 05:50 AM
Tuesday, October 21, 2025 05:50 AM
roots

సూర్య వంశీ సరికొత్త రికార్డ్..!

వైభవ్ సూర్యవంశీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోయినా.. ఈ ఆటగాడు ఓ సంచలనం. ఈ లెఫ్ట్ హ్యాండ్ యువ బ్యాటర్ దూకుడుకు ప్రపంచ క్రికెట్ ఫిదా అయిపోతోంది. తాజాగా బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్‌ లో ఆస్ట్రేలియా అండర్ 19తో జరిగిన రెండవ యూత్ వన్డే మ్యాచ్ లో 70 పరుగులు చేసాడు. ఈ మ్యాచ్ లో తన సహజ ఆట తీరుకు భిన్నంగా రాణించాడు. సూర్య వంశీ పవర్ ప్లే లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

Also Read : అయ్యర్ కు ఏమైంది..? జట్టు నుంచి సడెన్ గా..!

కానీ ఈ మ్యాచ్ లో మాత్రం నిలబడటానికి ప్రాధాన్యత ఇచ్చి అనంతరం దూకుడుగా బ్యాటింగ్ చేసాడు. మొదటి 10 ఓవర్లు ముగిసే సమయానికి అతను 38 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అప్పటి వరకు రెండు ఫోర్లు ఒక సిక్సు మాత్రమే అతని ఖాతాలో ఉన్నాయి. కాని పవర్ ప్లే ముగిసిన తర్వాత మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేసాడు. మ్యాచ్ 12వ ఓవర్లో ఈ యువ ఆటగాడు రెండు సిక్స్ లు, ఒక ఫోర్ బాదాడు. అక్కడి నుంచి మరింత దూకుడుగా ఆడే ప్రయత్నం చేసాడు. ఇక ఈ మ్యాచ్ లో అతని 5వ సిక్స్ చరిత్ర సృష్టించింది.

Also Read : ఆ స్టార్ హీరో కార్ల కలెక్షన్ తెలుసా..?

20 ఏళ్ళ కంటే తక్కువ వయసులో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు సూర్యవంశీ. యూత్ వన్డేల్లో వైభవ్ సూర్యవంశీ చేసిన 39వ సిక్స్ అది. 2012 అండర్ 19 ప్రపంచ కప్ లో భారత కెప్టెన్ ఉన్ముక్త్ చంద్.. మొత్తం 38 సిక్స్ లు కొట్టాడు. ఇప్పటి వరకు అదే రికార్డ్. ఇప్పుడు ఆ రికార్డ్ ను సూర్యవంశీ బ్రేక్ చేసాడు. ఈ మ్యాచ్ లో 68 బంతుల్లో 102 స్ట్రైక్ రేట్ తో, 70 పరుగులు చేసిన సూర్య వంశీ.. క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఇదే అతని తక్కువ స్ట్రైక్ రేట్ కావడం గమనార్హం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

పోల్స్