Monday, October 20, 2025 11:41 PM
Monday, October 20, 2025 11:41 PM
roots

ట్రంప్ సర్కార్ దారుణం.. 73 ఏళ్ళ భారత మహిళపై కఠిన చర్యలు..!

దాదాపు 10 నెలల నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం, అమెరికా అధికారుల వ్యవహారం పలు దేశాల పౌరులకు ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారతీయులు అమెరికాలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో పంజాబీ మహిళ ఒకరు అక్కడి పరిస్థితి వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 30 సంవత్సరాల క్రితం, హర్జిత్ కౌర్ తన ఇద్దరు కుమారులతో అమెరికాకు వెళ్ళారు. అయితే.. ఆమె కాలిఫోర్నియాలో ఎటువంటి పత్రాలు లేకుండా నివాసం ఉంటున్నారు.

Also Read : పాక్ ప్రధాని గాలి తీసిన భారత్..!

కానీ అమెరికాలో పనిచేసి పన్నులు చెల్లించింది. చట్ట ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి అధికారుల ముందు ఆమె హాజరు అయింది. కానీ 73 ఏళ్ళ కౌర్ ను.. సంకెళ్ళు వేసి.. ఆహారం మందులు లేకుండా కస్టడీలో ఉంచి ఆ తర్వాత తిరిగి భారత్ కు పంపించారు. అమెరికాలో మూడు దశాబ్దాలు ఉన్న తర్వాత ఆమెను కుటుంబం నుంచి వేరు చేయడంతో.. కన్నీరు పెట్టుకుంది. ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తన చేతులకు సంకెళ్లు వేసి అరెస్టు చేయడాన్ని ఆమె గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read : ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఆ ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు

సెప్టెంబర్ 8న.. తాను ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లానని, అక్కడ తాను రెండు గంటల పాటు ఎదురు చూసిన తర్వాత.. తన న్యాయవాది లేకుండా తనను ఓ కాగితంపై సంతకం చేయాలని అడిగారని.. ఆ తర్వాత బలవంతంగా తన వేలి ముద్రలు తీసుకున్నట్టు తెలిపారు. అక్కడి నుంచి ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. ట్రంప్ సర్కార్, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు ప్రారంభించినప్పటి నుండి అమెరికా నుండి బహిష్కరించబడిన 2,400 మంది భారతీయులలో కౌర్ కూడా ఒకరు. ఆమె రెండు రోజుల క్రితం దేశానికి చేరుకున్నారు. ఖైదీలకు ఇచ్చే యూనిఫాం ధరించి ఆమె భారత్ చేరుకున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

పోల్స్