ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ దంఖర్ రాజీనామా చేయడంతో తర్వాత ఆ పదవి చేపట్టేది ఎవరు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయిపొయింది. మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ఎంపీలు ఇలా చాలా మంది పేర్లు ఈ విషయంలో ప్రస్తావనకు వస్తున్నాయి. తాజాగా ఉపరాష్ట్రపతి పదవికోసం తెరపైకి కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి. కొత్త ఉపరాష్ట్రపతిగా ప్రచారంలో ఆరుగురి పేర్లు వినపడుతున్నాయి. ఉపరాష్ట్రపతి రేసులో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నట్లు సమాచారం.
Also Read : ముంచేసిన మిథున్ రెడ్డి.. జగన్ పని అయిపోయినట్లే
బిహార్ సీఎం నితీష్ కుమార్ పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇదే సమయంలో రేసులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అనూహ్యంగా వినిపిస్తున్న సీనియర్ ఎంపీ శశిథరూర్ పేరు.. మరింత ఆసక్తిని పెంచుతోంది. ఒకవేళ రాజనాథ్ ఆ పదవి చేపడితే తదుపరి రక్షణ శాఖా మంత్రి ఎవరు అనేది ఆసక్తిని రేపే అంశం. ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పేరు రక్షణ శాఖా మంత్రిగా వినపడుతోంది. యోగి మూడు సార్లు ఆ రాష్ట్ర సిఎంగా ఎన్నికయ్యారు.
Also Read : ఒక్క కామెంట్‌తో ఇండియాను ఫిదా చేసిన లోకేష్
మరో రెండేళ్ళలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. సాధారణంగా బిజెపి ఎన్నికలకు ముందు సిఎంలను మారుస్తూ ఉంటుంది. గతంలో గుజరాత్, త్రిపుర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఇలాగే సిఎంలను మార్చింది. ప్రస్తుతం యూపిలో కేశవ్ ప్రసాద్ మౌర్యను సిఎంగా ఎంపిక చేసి, రక్షణ శాఖా మంత్రిగా యోగి ఆదిత్య నాథ్ ను కేంద్ర కేబినేట్ లోకి తీసుకునే అవకాశం ఉండవచ్చు అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. దూకుడు స్వభావం కలిగిన యోగి ఆదిత్య నాథ్ రక్షణ శాఖా మంత్రి అయితే మాత్రం సంచలన పరిణామాలు ఉండవచ్చు అంటున్నారు పరిశీలకులు.