దేవర సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ఖచ్చితంగా పెరిగింది. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ తో పాటుగా ఇతర సౌత్ ఇండియన్ స్టేట్స్ లో కూడా దేవర హవా ఓ రేంజ్ లో నడిచింది. ఇప్పుడు ఎన్టీఆర్ కు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వస్తోంది. అక్కడి స్టార్ డైరెక్టర్ లు, నిర్మాతలు ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమాల కోసం ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో బాలీవుడ్ సినిమా ఒకటి ఉంది. వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. హ్రితిక్ రోషన్ హీరోగా వస్తోంది ఈ సినిమా. ఇప్పటికే ముంబైలో ఎన్టీఆర్ షూట్ లో కూడా పాల్గొంటున్నాడు.
ఈ సినిమా షూట్ లో జనవరి వరకు ఎన్టీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా షూట్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే వార్ 2 లో బిగ్ ట్విస్ట్ లు ఉండే ఛాన్స్ ఉంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఒకసారి చూస్తే… వార్ 2 తెలుగు టైటిల్ మార్చే అవకాశం ఉందని సమాచారం. యుద్ద భూమి అనే టైటిల్ తో ఈ సినిమాను తెలుగులో తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. ఇటీవల రజనీ కాంత్ హీరోగా వచ్చిన వేట్టాయన్ సినిమాను తమిళ టైటిల్ తోనే వేరే భాషల్లో విడుదల చేసారు.
Also Read : తన కెరీర్ ను తానే నాశనం చేసుకుంటున్న యంగ్ క్రికెటర్
దీనిపై విమర్శలు రావడంతో… మార్కెట్ కూడా కాస్త తగ్గింది. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకుని యుద్ద భూమి అనే టైటిల్ పెట్టమని అడిగాడట. అలాగే… సినిమాలో షారూఖ్ గెస్ట్ రోల్ ఉంటుంది. ఆ రోల్ తో ఎన్టీఆర్ కు యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేసారు. ఇప్పటికే షారూఖ్ షూట్ లో పాల్గొంటున్నాడు అని జాతీయ మీడియా పేర్కొంది. అలాగే ఐటెం సాంగ్ కూడా ఎన్టీఆర్ తో ఉంటుంది. ఇలా వరుస ట్విస్ట్ లతో వార్ 2 సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.