Friday, August 29, 2025 09:11 PM
Friday, August 29, 2025 09:11 PM
roots

రేవంత్ కొంప ముంచిన తుమ్మల..!

తెలంగాణలో ఏడాదిన్నర పైగా ఎన్నో వ్యయప్రయాసలతో సీఎం రేవంత్ రెడ్జి తెచ్చుకున్న మంచి పేరును ఒక్క దెబ్బతో తుడిచేశారు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు. వరుసగా రెండుసార్లు ఓడిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. అందుకే ఢిల్లీ పెద్దలు కూడా మారు మాట్లాడకుండా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు రేవంత్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేశారు. ప్రతిపక్షాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేశారు. తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెడుతూ అన్ని విధాలుగా దూసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి.

Also Read : అప్పుడు ప్రజాస్వామ్యం లేదా చిన్న సారూ..?

అయితే రేవంత్‌ దూకుడుకు మంత్రి తుమ్మల బ్రేక్ వేసినట్లు అయ్యింది. స్వతహాగా తుమ్మల నాగేశ్వర్రావు కూడా రైతు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, రైతుల సమస్యలతో పాటు అనుబంధ రంగాలపై కూడా అపారమైన పట్టు. అందుకే ఎన్నికల సమయంలో ఈ యార్డ్ నేనే కట్టించా.. ఈ ఊరు కాలువ నేనే తవ్వించా.. ఆ మార్కెట్‌ నా వల్లే.. అని పదే పదే చెప్పారు కూడా. అలాంటి తుమ్మల.. ఇప్పుడు రైతులకు యూరియా బస్తాలు అందించే విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. తుమ్మలకు కనీస ముందు చూపు లేకపోవడం వల్లే రేవంత్ సర్కార్‌ను రైతులు, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.

యూరియా బస్తాలను సకాలంలో రైతులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే మాట వాస్తవం. మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం తుమ్మల సొంతం. ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర కీలక శాఖలు నిర్వహించారు. కేంద్రం నుంచి యూరియాను వర్షాకాలానికి ముందు దిగుమతి చేసుకోవడంలో తుమ్మల నిర్లక్ష్యం చూపించారనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో రైతులు యూరియా కోసం రోడెక్కలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక్క బస్తా యూరియా ఇచ్చి పుణ్యం కట్టుకోండి అంటూ ప్రాధేయపడుతున్నారు కూడా.

Also Read : నచ్చితే కొను లేదంటే నీ ఇష్టం.. ట్రంప్ కు కేంద్రం వార్నింగ్

ప్రస్తుత సీజన్‌లో 62 లక్షల ఎకరాల్లో వరి, 49 లక్షల ఎకరాల్లో పత్తి వేసినట్లు అధికారులు చెబుతున్నారు. వరి, పత్తి పంటలకు ఒక సీజన్‌లో 4 సార్ల వరకు యూరియా చల్లుతారు రైతులు. తెలంగాణలో ప్రస్తుత సీజన్‌కు 9.80 లక్షల టన్నుల యూరియా అవసరం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచే యూరియాను రైతులు సిద్ధం చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇండెంట్ పంపిస్తే.. ఆ ప్రకారం కేటాయింపులు ఉంటాయి. కేంద్రం ఇవ్వలేదు అనేది మంత్రి తుమ్మల మాట. అయితే ఇదంతా అబద్ధమని.. ఇండెంట్ పెట్టకుండా.. లేఖ రాస్తే కేంద్రం ఎలా ఇస్తుందనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట.

వాస్తవానికి యూరియా కొరతకు ప్రధాన కారణం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో సాంకేతిక లోపం. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 145 రోజులు ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల 67 రోజులు మాత్రమే ప్లాంట్ పని చేసింది. ఆర్ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి చేసిన యూరియాలో 11 శాతం రాష్ట్రానికి సరఫరా చేస్తారు. ఈ ఏడాది షట్ డౌన్ కారణంగానే యూరియా కొరత తలెత్తింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ప్రకటించారు కూడా. అయితే మిగిలిన 50 శాతం యూరియా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారనే మాట మాత్రం చెప్పలేదు. దీంతో.. ముందస్తు దిగుమతులు చేసుకోవడంలో వ్యవసాయ శాఖ పూర్తిస్థాయిలో విఫలమైందనేది రైతు సంఘాలు, ప్రతిపక్షాల మాట.

Also Read : వన్డేలు ఆడతారు.. కోహ్లీ, రోహిత్ పై బోర్డు క్లారిటీ..!

సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి రైతు పక్షపాతి అనే పేరు. రైతుల మేలు కోసమే పని చేస్తుందనేది హస్తం పార్టీ నేతల మాట. కానీ యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్న రైతులు మాత్రం.. రేవంత్ సర్కార్‌పై గుర్రుగా ఉన్నారు. ఒకేసారి రైతు రుణ మాఫీ చేయడం, రైతు భరోసా మొత్తాన్ని పది రోజుల వ్యవధిలోనే జమ చేసిన రేవంత్ సర్కార్‌ పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రేవంత్ పైన పొగడ్తల వర్షం కురిపించారు కూడా. కానీ యూరియా బస్తాల కొరతతో ఆ మంచి పేరు కాస్తా మసక బారిందనే చెప్పాలి. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు తుమ్మల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. రేవంత్ సర్కార్‌ను బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం యూరియా కొరత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పదవికే ఎసరు పెట్టిందనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్