Tuesday, October 28, 2025 05:07 AM
Tuesday, October 28, 2025 05:07 AM
roots

యూట్యూబ్ లో తప్పుడు ప్రచారం.. టీటీడీ రియాక్షన్

గత కొన్నాళ్లుగా కొంతమంది సోషల్ మీడియాలో హడావుడి ఎక్కువగా చేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం తీవ్రమైపోయింది. లేని విషయాలను ఉన్నట్టుగా చూపించే విధంగా థంబ్ నెయిల్స్ పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ పేరుతో మీడియా అంటూ… కొందరు తప్పుడు ప్రచారం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యూట్యూబ్ లో వ్యూస్ కోసం కొంతమంది రెచ్చిపోవడంపై పలువురు ప్రముఖులు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోయి మరీ కొన్ని వీడియోలను శృతిమించి పోస్ట్ చేస్తున్నారని విమర్శలు వచ్చాయి.

Also Read : ఎన్టీఆర్‌ను రెచ్చగొడుతున్న వైసీపీ..!

లేటెస్ట్ గా ఓ విషయంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. సలహాదారు చాగంటి కోటేశ్వర రావుకు తిరుమలలో అవమానం అంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ. తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిర్వాహకులపై కేసు నమోదు చేసారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేసినందుకు పోలీసు కేసుతో పాటు న్యూఢిల్లీలో, విజయవాడ లో గల పిఐబీ (ప్రెస్ ఇస్పర్మెషన్ బ్యూరో) కి ఫిర్యాదు చేసింది టీటీడీ.

Also Read : పెద్దిరెడ్డిపై పవన్ కళ్యాణ్ గురి

విష ప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్స్ లను రద్దు చేయాలని యూట్యూబ్ మేటా మేనేజ్మెంట్ కి కూడా టీడీడీ ఫిర్యాదు చేసింది. చాగంటికి ఉన్న కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లను టీటీడీ చేసింది. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే కాకుండా , ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్ట ఉన్న టిటిడి సంస్థను పలుచన చేస్తూ ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను పదే పదే దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపైనా, సంస్థలపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్