Sunday, September 14, 2025 03:55 AM
Sunday, September 14, 2025 03:55 AM
roots

కష్టానికి దక్కిన గుర్తింపు..!

నన్నూరి నర్సిరెడ్డి… తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు ఇది. తెలుగుదేశం పార్టీ అభిమానిగా, కార్యకర్తగా, నాయకుడిగా ఆయన దూకుడు చాలా మందిని ఆకట్టుకుంది. మహానాడులో చంద్రబాబు లేదంటే ఇతర అగ్ర టీడీపీ నేతల ప్రసంగాల కంటే నన్నూరి నర్సిరెడ్డి ప్రసంగం కోసమే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. తెలంగాణాలో పార్టీ అధికారం కోల్పోయి 20 ఏళ్ళు దాటినా నర్సిరెడ్డి మాత్రం పార్టీ జెండాను వదలలేదు. పార్టీ నేతలు చాలా మంది పార్టీకి గుడ్ బై చెప్పినా ఆయన మాత్రం పార్టీలోనే ఉన్నారు.

ఆయనతో సన్నిహితంగా ఉండే రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ లోకి వెళ్లి సిఎం అయినా నన్నూరి మాత్రం టీడీపీలోనే ఉన్నారు. పార్టీలో ఉండి మౌనంగా ఇప్పుడు ఉన్నా సరే వేరే రాజకీయ పార్టీ వైపు చూడలేదు. దాదాపు 28 ఏళ్ళ నుంచి ఆయన టీడీపీలోనే ఉన్నారు. ఎప్పటి నుంచో ఆయనకు ఏదోక పదవి వస్తుందని ఆయన అభిమానులు, తెలంగాణా టీడీపీ కార్యకర్తలు ఎదురు చూస్తూ వచ్చారు. కాని నర్సిరెడ్డి మాత్రం ఏ పదవికి నోచుకోలేదు. ఎట్టకేలకు నర్సిరెడ్డికి పదవి లభించింది. టీటీడీ పాలక మండలిలో ఆయనకు అవకాశం వచ్చింది.

Also read : టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు

బుధవారం ఏపీ సర్కార్… టీటీడీ పాలక మండలిని ప్రకటించగా అందులో నర్సిరెడ్డి పేరు చూసి తెలంగాణా టీడీపీ అభిమానులు సంబురాలు చేసుకున్నారు. తెలంగాణాలో కూడా పార్టీ ఇప్పుడు బలోపేతం అయ్యే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే కచ్చితంగా ప్రజల్లోకి బలంగా పార్టీ వెళ్ళే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణాలో పలువురు బీఆర్ఎస్ నేతలు టీడీపీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్