Tuesday, October 21, 2025 03:34 PM
Tuesday, October 21, 2025 03:34 PM
roots

భారతీయ విద్యార్ధులకు ట్రంప్ గుడ్ న్యూస్..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారత్ సహా అనేక దేశాల పౌరులను ఆందోళనకు గురి చేస్తోన్న సంగతి తెలిసిందే. హెచ్ 1 బీ వీసాల ఫీజులను భారీగా పెంచడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అమెరికా వెలుపల నుంచి వెళ్ళే వారికి లక్ష డాలర్ల ఫీజు విధించారు డోనాల్డ్ ట్రంప్. దీనితో హెచ్ 1 బీ వీసాపై అమెరికా వెళ్ళాలి అనుకునే వారి కలలు ఒక్కసారిగా కూలిపోయాయి. దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండటంతో చాలా మంది ఆలోచన విరమించుకున్నారు.

Also Read : విలువల్లేని బిగ్ బాస్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ

వీసా రెన్యువల్ విషయంలో కూడా అదే వర్తించడం భయపెట్టింది. ఈ నేపధ్యంలో తాజాగా ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులతో సహా ప్రస్తుత అమెరికా వీసా హోల్డర్ లకు ఉపశమనం కలిగించారు. అమెరికాలో ఉండే విద్యార్ధులకు.. లక్ష డాలర్ల ఫీజు వర్తించదు అని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 19 న ఈ నిర్ణయం అమలులోకి వచ్చినప్పుడు.. అందరికి వర్తిస్తుందని అమెరికా స్పష్టం చేసింది. కానీ కార్పోరేట్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయంలో మార్పులు చేసింది.

Also Read : పాక్ ఏడుపు అందుకే.. ఆఫ్ఘన్ మాజీ ఎంపీ సంచలన కామెంట్స్..!

అక్టోబర్ 20న విడుదల చేసిన మార్గదర్శకాల్లో విద్యార్ధి దేశం విడిచి వెళ్ళకుండా అమెరికాలోనే ఉంటే.. లేదంటే అమెరికాలో ఉండేందుకు అప్లికేషన్ దాఖలు చేస్తే హెచ్ 1 బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు ఉండదు. అలాగే అమెరికా వెలుపల ఉన్న హెచ్ 1 బీ వీసాతో ఉన్న కార్మికులు.. దేశం బయట ఉన్నా.. లోపల ఉన్నా సరే, కొత్త అప్లికేషన్ పై నిర్ణయం వచ్చే వరకు లక్ష డాలర్ల ఫీజు వర్తించదు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని అమెరికా సర్కార్ పేర్కొంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

కందుకూరులో వైసీపీ ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సామాజిక వర్గాల మధ్య...

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

పోల్స్