Friday, September 12, 2025 10:55 AM
Friday, September 12, 2025 10:55 AM
roots

రష్యాతో ఉంటారా.. సిగ్గుచేటు.. అమెరికా సంచలన కామెంట్స్

భారత్ విషయంలో అవకాశం దొరికిన ప్రతీసారి విమర్శలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రభుత్వ వర్గాలు.. భారత్.. రష్యాకు, చైనాకు దగ్గర కావడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు అత్యంత సన్నిహితంగా కనపడటం, అంతర్జాతీయ మీడియా కూడా వెయిట్ ఇవ్వడంతో ట్రంప్ సర్కార్ ఉదికిపోతోంది. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సంచలన కామెంట్స్ చేసారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కావడం సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు.

Also Read : ట్రంప్ కు ఏదైనా జరిగితే నేనే.. జెడి వాన్స్ సంచలనం

మోడీ, జిన్‌పింగ్, పుతిన్‌లతో సన్నిహితంగా మెలగడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో తనకు తెలియదని, మోడీ రష్యాతో కాకుండా అమెరికాతో కలిసి ఉండాలనే విషయాన్ని ఆయన గ్రహించాలన్నారు. ప్రధాని మోదీ చైనాను సందర్శించిన ఒక రోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేసారు నవారో. రష్యాతో చమురు వ్యాపారాన్ని భారత్ నిలిపివేయాలని హెచ్చరించారు. భారత్ చమురు కొనుగోలు ద్వారా వచ్చే ఆదాయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని విమర్శించారు.

Also Read : ఎక్కడన్నా..? వైసీపీ కార్యకర్తలకు దొరకని జగన్

భారత్ ఇప్పటికే రెండు విధాలుగా సుంకాలు ఎదుర్కొంటుంది అన్నారు నవారో. 25 శాతం అన్యాయమైన వాణిజ్యం కారణంగా, మిగిలిన 25 శాతం రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందున అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మరో సంచలన కామెంట్ చేసారు. రష్యా చమురు కొనుగోలు ద్వారా బ్రాహ్మణ వ్యాపారులు ఎక్కువగా లాభ పడుతున్నారని మండిపడ్డారు. కాగా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ సమర్ధించుకుంది. ఇంధన ధరలు పెరగకుండా ఉండేందుకు ఇది కీలకమని తెలిపింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్