Tuesday, October 28, 2025 06:58 AM
Tuesday, October 28, 2025 06:58 AM
roots

పాకిస్తాన్ కు బాగా తెలుసు.. ట్రంప్ సంచలన కామెంట్స్

భారత్ – పాకిస్తాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై పెద్ద చర్చే జరుగుతోంది. తాజాగా మరోసారి రెండు దేశాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. భారత్ – పాకిస్తాన్ నాయకులు చాలా తెలివైన వారని.. ఈ రెండు దేశాల మధ్య అణు యుద్ధం తలెత్తే పరిస్థితి రాకూడదని నిర్ణయించుకునే.. ఇద్దరూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారని.. ట్రంప్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఆపినందుకు.. తనను తాను ట్రంప్ ప్రసంసించుకున్నారు.

Also Read : జాతీయ స్థాయికి వైసీపీ.. సక్సెస్ అవుతుందా..?

బుధవారం వైట్ హౌస్‌లో పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్‌ తో లంచ్ తర్వాత ఓవల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మునీర్‌ను కలవడం తనకు “గౌరవంగా” ఉందని ట్రంప్ అన్నారు. మునీర్ తో జరిగిన సమావేశంలో ఇరాన్ గురించి చర్చించారా అని అడిగగా.. ఇరాన్ గురించి పాకిస్తాన్ కు బాగా తెలుసు అన్నారు. ఇజ్రాయిల్ విషయంలో ఇరాన్ వైఖరి ఎలా ఉందో కూడా తనకంటే పాకిస్తాన్ కు స్పష్టమైన అవగాహన ఉందని.. ఇరాన్ విషయంలో తమ వైఖరికి పాకిస్తాన్ మద్దతు తెలిపిందన్నారు ట్రంప్.

Also Read : అణు యుద్దమేనా..? వెనక్కు తగ్గని ఇరాన్

ఇక మునీర్ గురించి మాట్లాడుతూ.. ఆయనను ఇక్కడికి పిలవడానికి కారణం.. యుద్ధాన్ని ముగించినందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను అంటూ కామెంట్ చేసారు ట్రంప్. ప్రస్తుతం భారత్ తో వాణిజ్య ఒప్పందం గురించి చర్చిస్తున్నామన్నారు. కెనడాలోని కననాస్కిస్‌లో జరిగే G7 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో మోడీ, ట్రంప్ సమావేశం కావాల్సి ఉంది. కాని ముందుగానే ట్రంప్ అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళే ముందు మోడీ ట్రంప్‌తో 35 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ జరిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్