ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికా.. తన స్వార్ధం కోసం చేసే స్నేహాలు, పశ్చిమ దేశాలలో పరోక్షంగా చేయిస్తున్న యుద్దాలు, ఆడుతున్న డ్రామాలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ఓ మాజీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిపై చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. సిరియాను ఒక బానిసగా చూసే అమెరికా ప్రభుత్వ విధానాన్ని రద్దు చేస్తూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాను కలవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
Also Read : టిబెటన్ పీఠభూమిపై విమానాలు ఎందుకు ఎగరలేవు?
అల్-ఖైదా నాయకత్వంలో పని చేసే.. తిరుగుబాటు ఉగ్రవాద సంస్థ, హయాత్ తహ్రీర్ అల్-షామ్ మాజీ నాయకుడు అహ్మద్. ఈ సంస్థను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా పేర్కొంది. 1979లో సిరియాపై అమెరికా విధించిన భారీ ఆంక్షలను అధ్యక్షుడు ట్రంప్ ఎత్తివేసిన మరుసటి రోజున.. సౌదీ అరేబియా యువ రాజు.. మొహమ్మద్ బిన్ సల్మాన్ అభ్యర్థన మేరకు ఈ సమావేశం నిర్వహించారు. యుద్ధంతో అతలాకుతలమైన సిరియాను గాడిలో పెట్టడానికి మీకు మంచి అవకాశం అంటూ సూచనలు కూడా చేసారు.
Also Read : విదేశీ బోర్డులపై బీసీసిఐ ఒత్తిడి..? ఐపిఎల్ కోసం బోర్డు సాహసం..?
మాజీ ఉగ్రవాదిని.. బలమైన, ఆకట్టుకునే వ్యక్తిగా అభివర్ణించారు ట్రంప్. ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసారు. దాదాపు 25 ఏళ్ళ తర్వాత సిరియా నాయకుడిని కలిసిన తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల బ్లాక్‌లిస్ట్ నుండి సిరియాను అమెరికా తొలగిస్తుందని ట్రంప్ ఎటువంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. అతనిపై 10 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది అమెరికా. అలాంటి వ్యక్తిని ట్రంప్ కలవడం, పొగడటం ఆశ్చర్యం కలిగించింది.