Sunday, October 19, 2025 08:24 PM
Sunday, October 19, 2025 08:24 PM
roots

అమెరికా వీసాకు కొత్త రూల్స్.. వీసా రావాలంటే కష్టమేనా..?

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అమెరికా అధ్యక్ష పదవిలో రెండవ సారి కూర్చున్న ట్రంప్.. తమ దేశానికి ఎవరైనా అడుగు పెట్టాలంటే తాను విధించిన నిబంధనలను పాటించాల్సిందే అంటూ భయపెడుతున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. అమెరికా వ్యతిరేక విధానాలను కలిగి ఉన్న ఎవరైనా సరే తమ దేశానికి రావడం కష్టమే అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read : వార్ 2 వరల్డ్ వైడ్ లెక్క ఇదే.. మరీ ఇంత దారుణమా..?

న్యూ రూల్ ప్రకారం, స్టూడెంట్ వీసా అయినా, వర్క్ వీసా అయినా, గ్రీన్ కార్డ్ అయినా లేదా ఆ దేశ పౌరసత్వం అయినా సరే దరఖాస్తుదారుడు అమెరికన్ అనుకూల అభిప్రాయాలను కలిగి లేడని న్యాయనిర్ణేత అధికారి విశ్వసిస్తే వారి దరఖాస్తు తిరస్కరించవచ్చు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే ఎవరికి అయినా సరే ఈ విషయంలో షాక్ తప్పదు. అమెరికన్ వ్యతిరేక భావజాలాలను ప్రోత్సహించే వారికి వీసా ఇవ్వరు. వీసా ఇచ్చే అధికారులు దరఖాస్తుదారులకు సంబంధించి పలు కీలక విషయాలను పరిశీలిస్తారు.

Also Read : విశ్వంభర.. సెకండ్ ఆఫ్ ఎలా ఉంటుందో తెలుసా..!

ఉగ్రవాద సంస్థలు లేదా అమెరికన్ వ్యతిరేక, యూదు వ్యతిరేక లేదా యూదు వ్యతిరేక ఉగ్రవాదానికి సంబంధించిన భావజాలాల అభిప్రాయాలను ఆమోదించినా, ప్రోత్సహించినా, మద్దతు ఇచ్చినా లేదా ఏ విధంగా అయినా మద్దతు ఇచ్చినా వీసా నిరాకరిస్తారు. అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్ కార్డులు లేదా వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే ఇతరుల సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తామని అమెరికా ఏప్రిల్ లోనే ప్రకటన చేసింది. అది ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చింది. ట్రంప్ సర్కార్ ను విమర్శించినా సరే వీసా రావడం కష్టమే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్