Friday, September 12, 2025 10:41 PM
Friday, September 12, 2025 10:41 PM
roots

అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ కక్ష..!

అగ్ర రాజ్యం అమెరికా వెళ్ళడం ఏమో గాని అక్కడ అక్రమ వలసదారుల పేరుతో.. విదేశీయులను వేధిస్తోన్న విధానం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఆ దేశ అధ్యక్షుడిగా రెండవ సారి డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి వలసదారుల విషయంలో ట్రంప్ సర్కార్.. వివాదాస్పదంగా వ్యవహరిస్తోంది. భారత్ సహా అనేక దేశాలకు చెందిన వారిని తిప్పి పంపిస్తున్నారు. ఇక సరైన పత్రాలు లేక దొరికిన వారిని కూడా చిత్ర హింసలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి.

Also Read : పాపం ఆయన సంగతేంటి..? మాజీ సీఎం ఎదురు చూపులు..!

తాజాగా మయామి ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లోని ఖైదీలను సంకెళ్లు వేసి, వారి చేతులను వెనుకకు కట్టి తీసుకు వెళ్తున్న ఘటనపై, ది గార్డియన్ ఓ కథనం రాసింది. కుక్కలా మాదిరిగా.. భోజనం పెట్టి అక్కడ ఉన్న ప్లేట్ లో ఆహారం తినమని మోకరిల్లే విధంగా చేసారని ది గార్డియన్ వెల్లడించింది. దక్షిణ ఫ్లోరిడాలోని మూడు సెంటర్లలో సౌకర్యాల పరిస్థితులను వివరిస్తూ సోమవారం ఈ కథనం ప్రచురించింది. అక్కడి పరిస్థితులు చూస్తే మీ జీవితం ముగిసినట్లు అనిపిస్తుందని తన కథనంలో పేర్కొంది.

Also Read : స్టాక్ మార్కెట్ లో హెరిటేజ్ దూకుడు.. ఒక్కరోజులో భువనేశ్వరి లాభం ఎంతంటే..?

క్రోమ్ నార్త్ సర్వీస్ ప్రాసెసింగ్ సెంటర్, బ్రోవార్డ్ ట్రాన్సిషనల్ సెంటర్, మయామిలోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్‌లలో పరిస్థితి ఈ విధంగా ఉందట. మగవారు ఎక్కువగా ఉండే ఈ సెంటర్లలో.. పరిస్థితి ఇంత దారుణంగా ఉందని, తెలిపింది. రాత్రి 7 గంటల వరకు వారికి భోజనం పెట్టలేదని రాసుకొచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల, కొంతమందిని పార్కింగ్ స్థలంలోని బస్సులో 24 గంటలకు పైగా ఉంచారట. పురుషులు, మహిళలు ఆ బస్ లో ఉన్నారని, వారికి ఒకటే టాయిలెట్ ఇచ్చారని కథనంలో ప్రస్తావించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్