కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. సచిన్ టెండూల్కర్‌కు షార్జా క్రికెట్ స్టేడియంకు విడదీయరాని అనుబంధం. అక్కడ మ్యాచ్ అంటే సచిన్ చెలరేగిపోతారు. ఇసుక తుఫాన్‌లా బాల్ బౌండరీ లైన్ దాటిపోతుంది. ఇక ధోనీకి ముంబై వాంకేడె స్టేడియం అంటే చాలా ఇష్టం. 2011 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అక్కడే ఆడి గెలిచారు. అలాగే కొన్ని స్టేడియాల పేర్లు చెబితే.. బాబోయ్ అనేస్తున్నారు. అలాంటి వాటిలో ఇప్పుడు టాప్ ప్లేస్‌లో ఉన్న స్టేడియం అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియం. ఈ స్టేడియంలో మ్యాచ్ అంటే.. ఇప్పుడు అన్ని జట్లు వామ్మో అని భయపడే పరిస్థితి.
Also Read : జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శిఖర్ ధావన్
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్న స్టేడియం నరేంద్రమోడీ స్టేడియం. మోతేరాలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్ స్టేడియంను దాదాపు రుూ.800 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశారు. మొత్తం లక్ష 32 వేల మంది ఈ స్టేడియం కెపాసిటీ. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఇక సామర్థ్యం పరంగా కూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. ఈ స్టేడియం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధాన జట్లు ఆడే మ్యాచ్‌లను, టైటిల్ ఫైనల్ మ్యాచ్‌లను కూడా ఇక్కడే నిర్వహిస్తోంది బీసీసీఐ. ఆదాయం బాగానే వస్తున్నప్పటికీ.. ఈ స్టేడియంలో మ్యాచ్ అంటే దిగ్గజ జట్లు కూడా భయపడుతున్నాయి.
ఐపీఎల్ 2022 ఫైనల్ గెలిచినప్పటి నుండి.. గుజరాత్ టైటాన్స్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత, అదే స్టేడియంలో 2023 ఫైనల్‌లో ఈ జట్టు ఓడిపోయింది. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు మారాడు. శుభ్‌మాన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించారు. అయినా సరే.. ఇప్పటికీ ఆ జట్టు సరైన ఆటతీరు చూపించటం లేదు. ఆ తర్వాత నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 గెలిచింది. ఆ తర్వాత సీఎస్‌కే పతనం ప్రారంభమైంది. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన చెన్నై టీమ్.. ఏకంగా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఐపీఎల్ 2025 చెన్నై టీమ్‌కు పీడకలగా మారిపోయింది. ఐపీఎస్ ఆరంభం నుంచి సీఎస్‌కేతోనే ఉన్న రవీంద్ర జడేజాను కూడా మెనేజ్‌మెంట్ వదులుకోవాల్సి వచ్చింది.
Also Read : టీమిండియా అప్‌డేట్.. ఫైనల్ టీమ్‌లోకి శాంసన్..!
ఇక నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 2023 వన్డే ప్రపంచ కప్ టోర్నీ గెలిచినప్పటి నుండి వారి పతనం ప్రారంభమైంది. కంగారు జట్టు 2024 టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుండి నిష్క్రమించింది. #WTC ఫైనల్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఆ జట్టు ఆట తీరు ఇప్పటికీ మెరుగవలేదు. ప్రస్తుత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో జింబాబ్వే చేతులో ఓడిన ఆస్ట్రేలియా.. చివరికి టోర్నీ నుంచే ఎలిమినేట్ అయ్యింది. ఇక నరేంద్ర మోదీ స్టేడియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మంచి చేసిందో.. చెడు చేసిందో అర్థం కాలేదు. ఇప్పటి వరకు కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ ఐపీఎల్ 2025 టోర్నీని నరేంద్ర మోదీ స్టేడియంలోనే గెలుచుకుంది. అయితే ఆ తర్వావత బెంగళూరులో జరిగిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో జట్టు మేనేజ్‌మెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. చివరికి ఫ్రాంచైజీని అమ్ముతున్నారనే పుకార్లు కూడా వినిపించాయి.
తాజాగా వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ఇదే స్టేడియంలో సౌతాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన టీమిండియా.. ఏకంగా 76 పరుగుల తేడాతో ఓడింది. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దురదృష్టకర స్టేడియం అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

