Wednesday, February 4, 2026 04:23 PM
Wednesday, February 4, 2026 04:23 PM

గంభీర్ డ్రామాలకు తెరదించిన కోహ్లీ, రోహిత్

గత ఏడాదికాలంగా భారత క్రికెట్ పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పెత్తనం ఏ స్థాయిలో సాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. యువ ఆటగాళ్లతో జట్టును నింపాలని ప్రయత్నం చేసిన గంభీర్.. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో కక్ష సాధింపుగా వ్యవహరించాడు అనేది ఎన్నో సందర్భాల్లో రుజువు అయింది. అందుకే వాళ్లతో సన్నిహితంగా ఉండే రవిచంద్రన్ అశ్విన్, చటేశ్వర్ పూజారా వంటి వాళ్లను పక్కన పెట్టాడు గంభీర్. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ గంభీర్ ఆటలు మాత్రం సాగటం లేదు.

Also Read : రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ కు మైండ్ బ్లాక్

తాజాగా మొదలైన విజయ్ హజారే ట్రోఫీలో ఇద్దరు సెంచరీలతో అదరగొట్టారు. ఇద్దరి ఆట తీరుకు విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. ఇక ఇక్కడి నుంచి సోషల్ మీడియాలో గంభీర్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. ఆస్ట్రేలియాలో, సౌత్ ఆఫ్రికా తో జరిగిన సిరీస్ లో ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో ఇద్దరు రాణించటంతో.. గంభీర్ కు దెబ్బ మీద దెబ్బ తగిలిందని.. గంభీర్ ఆడుతున్న డ్రామాలకు బ్యాట్ తో.. ఇద్దరూ తెరదించుతున్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి. న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో కూడా ఇద్దరు ఆడితే.. వాళ్ళిద్దరికంటే ముందే గంభీర్ జట్టును వదిలేస్తాడంటూ కామెంట్స్ మొదలుపెట్టారు.

Also Read : చంద్రబాబు విజన్‌కు గ్లోబల్ గుర్తింపు.. విశాఖకు అమెజాన్ ఐటీ సెంటర్

గిల్ ను జట్టు మీద రుద్దడానికి ఇద్దరినీ గంభీర్ టార్గెట్ చేశాడని.. చివరకు గిల్, గంభీర్ ఇద్దరు జట్టు నుంచి దూరంగా జరిగే పరిస్థితి వచ్చిందంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. వాళ్ళిద్దరి మీద పెత్తనం చేయడం.. బోర్డు మీద పెత్తనం చేసినంత ఈజీ కాదని.. వాళ్ళిద్దరూ విషయంలో కుట్ర చేసి మ్యాచ్ లు లైవ్ స్ట్రీమింగ్ కాకుండా ఆపినా.. మైదానంలో వాళ్ళిద్దరి తుఫాను మాత్రం ఆపలేకపోయాడంటూ సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆట తీరు చూసి.. రోహిత్ ఆడిన ప్రతి సిక్స్ కూడా గంభీర్ కే తగిలిందంటూ.. ఆడుకుంటున్నారు ఫాన్స్. వీళ్ళిద్దరూ 2029 ఛాంపియన్స్ ట్రోఫీ వరకు జట్టుతోనే ఉంటారని.. గంభీర్ మళ్లీ బిజెపి కార్యాలయంలో కూర్చోవాలంటూ విమర్శిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్