Monday, March 23, 2026 08:12 PM
Monday, March 23, 2026 08:12 PM

టూరిస్ట్ వీసాలు కూడా కష్టమేనా..? మూడు నిమిషాల్లో వీసా రిజెక్ట్..!

భారతీయులకు అమెరికా వీసా రావడం కష్టమేనా..? వీసా ఇంటర్వ్యూలు మరింత కఠినంగా మారనున్నాయా..? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. పరిస్థితి క్రమంగా మరింత కఠినంగా మారే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓ వీసా విషయంలో అమెరికన్ ఎంబసీ అధికారులు అనుసరించిన వైఖరి అత్యంత వివాదాస్పదం అయింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో, ఈ నెలలో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అమెరికా అధికారి అత్యంత కఠినంగా వ్యవహరించారు.

Also Read : 24 గంటల్లో అమెరికా రావాలి.. హెచ్ 1బీ విసా హోల్డర్ లకు ఆదేశం

భారత్ లో కస్టమ్స్ లో పని చేసే ఓ అధికారి.. టూరిస్ట్ వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్ళారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇల్లు, రూ. 50 లక్షలకు పైగా బ్యాంక్ బ్యాలెన్స్, టూర్ క్యాలెండర్ పక్కాగా ఉన్నప్పటికీ, అతనికి అతని భార్యకు వీసా నిరాకరించారు. కేవలం 3 నిమిషాల ఇంటర్వ్యూలో సెక్షన్ 214(బి) కింద వీసాలు నిరాకరించారు. కంప్యూటర్ స్క్రీన్ లోనే ఎక్కువ టైం గడిపిన అధికారి.. అన్ని పేపర్స్ ఖచ్చితంగా ఉన్నప్పటికీ.. అతని అర్హతల గురించి ఏ విధమైన ప్రశ్నలు వేయలేదని జాతీయ మీడియా మీడియా పేర్కొంది.

Also Read : ఫ్యామిలీని టచ్ చేసిన లిక్కర్ స్కామ్ విచారణ..?

అన్ని పేపర్స్ తాను తీసుకు వెళ్ళినా సరే ఏదీ పరిశీలించకుండా కేవలం 3 నిమిషాల్లో వీసా నిరాకరించారు అని తెలిపింది. టూరిస్ట్ వీసాల విషయంలో కూడా అమెరికా కఠినంగా వ్యవహరిస్తుందని, అక్కడికి వెళ్లి చిన్న చిన్న వ్యాపారాల్లో భారతీయులు పెట్టుబడులు పెడుతున్నారు అనే అనుమానంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, తమ భవిష్యత్తు గమ్యస్థానంగా అమెరికాను ఎంపిక చేసుకోవడమే కాకుండా ఇప్పటి వరకు వెళ్ళిన టూరిస్ట్ లు ఏదోక వీసా అప్లికేషన్ ల పేరుతో అమెరికాలో ఉండిపోవడం కూడా జరుగుతోందని అందుకే అమెరికా వీసాలు నిరాకరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమరావతికి ఎన్నో ప్రత్యేకతలు..!

హైదరాబాద్‌ను అధిగమించేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని...

శ్రీశైలం డ్యామ్ పునాదులు...

రెండు తెలుగు రాష్ట్రాల సాగు, జల...

కావలి టీడీపీలో గ్రూపు...

ఓ వైపు టీడీపీ అధిష్టానం, సిఎం...

జగన్‌తో ఒంటరి పోరాటం...

ఉమ్మడి కడప జిల్లాలో ఆ ఎమ్మెల్యే...

ఏపీలో ఏనుగు దంతాల...

వన్య ప్రాణుల భద్రత విషయంలో ప్రభుత్వాలు...

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

పోల్స్