Tuesday, October 28, 2025 01:58 AM
Tuesday, October 28, 2025 01:58 AM
roots

తెలుగోళ్ళ తమిళ పిచ్చి.. ఆ డైరెక్టర్ల వెంట పడుతున్నారా…?

ఒకప్పుడు తమిళ సినిమాలు మన దగ్గర డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం.. లేదంటే మన తెలుగు సినిమాలను తమిళంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం మినహ అక్కడి డైరెక్టర్లు ఇక్కడికి వచ్చి సినిమాలు చేసింది చాలా తక్కువనే చెప్పాలి. ఇక మన డైరెక్టర్లు కూడా కొంతమంది అక్కడ సెటిలైపోవడమే గానీ ఇక్కడ.. అక్కడ సినిమాలు చేసే పరిస్థితి అయితే లేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా సినిమాల హడావుడి మొదలైన తర్వాత.. మన స్టార్ డైరెక్టర్లు.. స్టార్ హీరోలు తమిళం పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Also Read : పవన్ కు వెయిట్ ఇవ్వడం వెనుక రీజన్ అదేనా…?

అటు తమిళ హీరోలు కూడా తెలుగు మార్కెట్ లో పెంచుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో కమలహాసన్, సూర్య, కార్తీ వంటి వాళ్లు తెలుగు మార్కెట్ పై కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఇక అక్కడి డైరెక్టర్లు కూడా మన స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ముగ్గురు, నలుగురు స్టార్ హీరోలను తమిళ డైరెక్టర్లు లైన్ చేసుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్ ను భాగం చేయాలని కష్టపడుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ కు ఒక కథ కూడా వినిపించాడు.

Also Read : కోహ్లీ సెంచరీ అడ్డుకునే కుట్ర జరిగిందా…?

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించాలని ఇప్పటికే ఒప్పందం కూడా జరిగిపోయింది. 2027 లేదంటే 2026 చివర్లో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా లోకేష్ కనగరాజ్ తోనే సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అటు వెట్రిమారన్ తో కూడా ఓ సినిమా లైన్ చేసాడు. ప్రస్తుతం ఇద్దరు బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు కాస్త లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్టు కొట్టిన అల్లు అర్జున్ తో తమిళ మరో స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

Also Read : అందరూ స్టార్లే.. అఖండ2 పై బోయపాటి బిగ్ స్కెచ్

ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బిజీగా ఉండడంతో కాస్త ఈ సినిమా ఆలస్యం అవుతుంది. ఇక మరో డైరెక్టర్ శిబి చక్రవర్తి కూడా తెలుగు పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నాచురల్ స్టార్ నానితో ఒక సినిమాను ఆల్మోస్ట్ ఫైనల్ చేయించుకున్నాడు. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది ప్రస్తుతం నాని రెండు సినిమాల్లో బిజీగా ఉండటంతో ఆ సినిమా కాస్త ఆలస్యం అవుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్