Monday, October 27, 2025 10:33 PM
Monday, October 27, 2025 10:33 PM
roots

నార్త్ పైనే ఫోకస్… బాలీవుడ్ వెన్నులో వణుకు

ఒకప్పటి తెలుగు సినిమా లెక్కలు వేరు ఇప్పుడు తెలుగు సినిమా లెక్కలు వేరు. తెలుగు సినిమా అంటే సౌత్ లో అన్ని రాష్ట్రాల్లో ఆడటమే కష్టంగా ఉండేది. కానీ పాన్ ఇండియా అనే ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా కథ మారిపోయింది. బాహుబలి సినిమా నుంచి ఈ ట్రెండ్ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. ఇప్పుడు మన స్టార్ హీరోలు అందరూ… పాన్ ఇండియాపై ఫోకస్ చేసి సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప 2 తో పాన్ వరల్డ్ స్టార్ అవుతా అంటూ ధీమాగా ఉన్నాడు.

Also Read : పుష్ప ప్రమోషన్స్ కి అతిధులుగా ఆ ముగ్గురు..!

ఇక రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కానీ అది మల్టీ స్టారర్ సినిమా కావడంతో క్రెడిట్ ఎన్టీఆర్ కు కూడా దక్కుతుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో ఎన్టీఆర్ తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ప్రభాస్ లెక్క ఎప్పుడో మారిపోయింది. ఈ టైంలో బాలీవుడ్ ను షేక్ చేసేలా మన స్టార్ లు అడుగులు వేయడం హాట్ టాపిక్ గా మారుతోంది. తెలుగు హీరోలు నార్త్ లో చేస్తున్న ప్రమోషన్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

Also Read : పుష్ప పేరుతో వైసీపీ సోషల్ మీడియా పొలిటికల్ వార్

అల్లు అర్జున్… పుష్ప 2 ఈవెంట్ ను గ్రాండ్ గా బీహార్ లో చేస్తే దాదాపు రెండు లక్షల మంది వచ్చారు. అది చూసి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఖంగుతిన్నారు. అలాగే… గేమ్ చేంజర్ ఈవెంట్ ను లక్నోలో నిర్వహిస్తే అక్కడికి కూడా ప్రేక్షకులు భారీగా తరలి వచ్చారు. దేవర ప్రమోషన్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే వార్ 2 ప్రమోషన్స్ కూడా నార్త్ లో గ్రాండ్ గా స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. వార్ 2 బాలీవుడ్ సినిమానే అయినా ఎన్టీఆర్ బొమ్మతో సౌత్ లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇలా మన సౌత్ స్టార్ హీరోలు అందరూ… నార్త్ పై ఓ రేంజ్ లో ఫోకస్ పెట్టారు. దీంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దీని పై తీవ్ర చర్చ నడుస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్