Saturday, September 13, 2025 03:08 AM
Saturday, September 13, 2025 03:08 AM
roots

పొట్టకింది కొవ్వును తగ్గించే సింపుల్‌ చిట్కాలు మీ కోసం..!

అతిగా ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడి, కేల‌రీలు ఎక్కువ‌గా ఉండే ఫుడ్ తినడం, హార్మోన్ల మార్పులు తదితర అనేక‌ కార‌ణాలవ‌ల్ల పొట్టకింద కొవ్వు పెరుగుతుంది. పొట్టచుట్టూ కొవ్వు చేర‌డంవ‌ల్ల అంద‌హీనంగా కూడా క‌నిపిస్తుంటారు. అందుకే బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించుకునేందుకు నానా ప్రయ‌త్నాలు చేస్తుంటారు. అతిగా ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడి, కేల‌రీలు ఎక్కువ‌గా ఉండే ఫుడ్ తినడం, హార్మోన్ల మార్పులు తదితర అనేక‌ కార‌ణాలవ‌ల్ల పొట్టకింద కొవ్వు పెరుగుతుంది. పొట్టచుట్టూ కొవ్వు చేర‌డంవ‌ల్ల అంద‌హీనంగా కూడా క‌నిపిస్తుంటారు. అందుకే బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించుకునేందుకు నానా ప్రయ‌త్నాలు చేస్తుంటారు. న‌చ్చిన ఫుడ్‌కు దూరంగా ఉంటారు. చెమ‌ట‌లు చిందేలా వ్యాయామాలు చేస్తారు. అయినా ఫ్యాట్‌ తగ్గక ఆవేదన చెందుతుంటారు. కానీ కొన్ని సింపుల్‌ టిప్స్‌ను ఫాలో అయితే బెల్లీ ఫ్యాట్‌ను సులువుగా తగ్గించుకోవచ్చు.

Also Read : ఇంటర్ మార్కుల శాడిజానికి చెక్.. ఫస్ట్ ఇయర్ పరిక్షలు రద్దు..!

చిట్కాలు:

  1. బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించుకోవాలనుకునేవారు ముందుగా అల్లంటీని డైలీ డైట్‌లో చేర్చుకోవాలి. అల్లం టీ తీసుకోవ‌డంవల్ల శ‌రీరంలో సహజంగా వేడిని పుడుతుంది. ఈ వేడి అధిక కేల‌రీల‌ను, కొవ్వును క‌రిగిస్తుంది.
  2. అలాగే ప్రతి రోజు ఉద‌యం నానబెట్టిన బాదాం గింజలను ఎనిమిది నుంచి ప‌ది వ‌ర‌కు తీసుకోవాలి. ఎందుకంటే బాదాంలో ఉండే మెగ్నీషియం మజిల్ స్ట్రెంథ్‌ను పెంచుతుంది. త‌ద్వారా బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది.
  3. ఫైబ‌ర్ ఎక్కువ‌గా, కేల‌రీలు త‌క్కువ‌గా ఉండే బాదాం పప్పు తీసుకోవ‌డంవల్ల ఎక్కువ స‌మ‌యం ఆకలి వేయ‌కుండా ఉంటుంది. ఫలితంగా పొట్టకింద కొవ్వు తగ్గిపోతుంది.
  4. ప్రతి రోజు ఉద‌యం లేదా రాత్రి స‌మ‌యంలో ఒక క‌ప్పు గ్రీన్ టీ తీసుకోవాలి. గ్రీన్ టీ కూడా బెల్లీ ఫ్యాట్‌ను సులువుగా క‌రిగిస్తుంది.
  5. అలాగే రాత్రిపూట వరి అన్నానికి బ‌దులుగా ఓట్స్ లేదా బ్రౌన్ రైస్ తీసుకోవాలి. త‌ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టవ‌చ్చు. వరి అన్నంతో ఫ్యాట్‌ పేరుకుపోతుంది.
  6. అదేవిధంగా రోజూ నీరు కూడా ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది. శ‌రీరానికి స‌రిప‌డా నీరు అందిన‌ప్పుడే టాక్సిన్స్ తొలగిపోయి పొట్టచుట్టూ కొవ్వు క‌రుగుతుంది.
  7. అవకాడో, పైనాపిల్, పుచ్చకాయ, నిమ్మ‌, క్యారెట్ లాంటి వాటిని డైట్‌లో చేర్చుకోవ‌డం ద్వారా కూడా పొట్టకింద కొవ్వును కరిగించుకోవచ్చు.
  8. అంతేగాక క్రమం త‌ప్పకుండా ఓ ఇర‌వై నిమిషాలపాటు వ్యాయామాలు చేయడం ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించుకోవ‌చ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్