భారత క్రికెట్ లో రిటైర్మెంట్ ల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ నుంచి కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరు రిటైర్ అవుతున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చటేశ్వర్ పూజార క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇక ఇప్పుడు మరో ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది అనే ప్రచారం మొదలైంది. భారత జట్టుకి సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన ఆటగాళ్లు.. తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read : ఆయనకు మంత్రి పదవి ఖాయమా..!
సీనియర్ పేస్ బౌలర్ ఇశాంత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇతను జాతీయ జట్టులో ఆడటం లేదు. కేవలం దేశవాలి క్రికెట్ తో పాటుగా ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఇషాంత్ కు జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. 100 టెస్టులకు పైగా ఆడిన ఈ ఢిల్లీ బౌలర్.. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం ఖాయం అంటున్నాయి క్రికెట్ వర్గాలు.
Also Read : రేవంత్, కేటీఆర్ కు ఉన్న ధైర్యం జగన్‌కు లేదా..?
ఇతనితో పాటుగా మరో సీనియర్ బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం ఖాయంగా కనబడుతోంది. కేవలం దేశవాలి క్రికెట్ లోనే కొనసాగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక అజింక్య రహానే సైతం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం.. దాదాపుగా ఖాయం అయింది. జాతీయ జట్టులో చోటు కోల్పోవడంతో కేవలం ఐపిఎల్ కు మాత్రమే రహానే పరిమితం అయ్యాడు. గత రంజి సీజన్లో కూడా ముంబై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాతీయ జట్టుకు ఆడటం కష్టం అని భావిస్తున్న ఈ ఆటగాళ్లు తప్పుకోవడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.