Monday, October 27, 2025 10:40 PM
Monday, October 27, 2025 10:40 PM
roots

ఓపిక తక్కువ ఎమ్మెల్యేలు.. మోది ప్రసంగం మధ్యలోనే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతమైంది. అమరావతి పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రధానమంత్రి మోడీని చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బస్సుల్లో సొంత కార్లలో ప్రజలు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యేలు అందరూ సభకు హాజరు కావాలని ఎన్డీఏ పార్టీల అధినాయకత్వాలు స్పష్టం చేశాయి. అధిష్టానం ఆదేశాలతో ఎమ్మెల్యేలందరూ దాదాపుగా విజయవాడ చేరుకున్నారు.

Also Read : తోపుదుర్తి సేవలో రాప్తాడు పోలీసులు

కొంతమంది ఎమ్మెల్యేలు ఒకరోజు ముందుగానే విజయవాడ చేరుకుని సభకు హాజరయ్యారు. ఇక చాలామంది ఎమ్మెల్యేలు ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని ముందుగానే సభ స్థలానికి చేరుకున్నారు. అయితే సభ మధ్యలోనే కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఎమ్మెల్యేలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసిన సరే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం.. ప్రధాని ప్రసంగం పూర్తిగా కాకుండానే బయటకు వచ్చేసారు. మరి కొంతమంది చంద్రబాబు ప్రసంగం సమయంలో బయటకు రావడం చికాకు పెట్టింది.

Also Read : లోకేష్‌ పదవిపై ఫుల్ క్లారిటీ..!

ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. వివిఐపీలు వచ్చే మార్గం కూడా పగడ్బందీగా ఏర్పాటు చేశారు. అయినా సరే కొంతమంది ఎమ్మెల్యేలు.. తూతూ మంత్రంగా వచ్చి వెళ్లిపోవడం పై విమర్శలు వస్తున్నాయి. విజయవాడ నగరంలో కూడా ఎమ్మెల్యేలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు జరిగాయి. ఎంజీ రోడ్డుతో పాటుగా.. ఏలూరు రోడ్డు, ప్రకాశం బ్యారేజ్.. వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గొల్లపూడి వైపు నుంచి ప్రజలు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సాకు చూపించి కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు రావడం అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యపరిచింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్