Tuesday, October 28, 2025 04:21 AM
Tuesday, October 28, 2025 04:21 AM
roots

సోషల్ మీడియాలో ఉగ్రవాదులు.. ఎలా దొరికారంటే..?

భారత్ లో ఉగ్రవాద కార్యాకలాపాలపై నిఘా వ్యవస్థలు ఫోకస్ పెట్టాయి. పహల్గాం దాడి తర్వాత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా గుజరాత్ లో నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది ఉగ్రవాద నిరోధక బృందం. నకిలీ కరెన్సీ రాకెట్‌ను నడుపుతూ, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న అల్-ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసినట్టు గుజరాత్ పోలీసులు వెల్లడించారు. వారిని ప్రస్తుతం రిమాండ్ కు తరలించారు.

Also Read : వీసా లేకుండా భారతీయులు ఎన్ని దేశాలకు వెళ్ళవచ్చంటే..?

మొహమ్మద్ ఫైక్, మొహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీ.. అల్-ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు గానూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, అనుమానాస్పద యాప్‌లను ఉపయోగించారని పోలీసులు వెల్లడించారు. వారి కమ్యూనికేషన్ కు సంబంధించిన ఆధారాలను లేకుండా చేసేందుకు గానూ ఆటో-డిలీట్ యాప్‌లను ఉపయోగించారని తెలిపారు. ఆ నలుగురిని విచారిస్తున్నట్లు ఏటీఎస్ తెలిపింది. నిందితులకు చాన్నాళ్ళుగా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందని గుజరాత్ ఏటీఎస్ అధికారులు తెలిపారు.

Also Read : ఓన్లీ క్యాష్.. నో యూపీఐ ప్లీజ్.. వ్యాపారులకు షాక్..!

వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అల్-ఖైదాతో సంబంధాలు పెట్టుకున్నారని సంచలన విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాల గురించి సోషల్ మీడియాతో పాటుగా వివిధ సోషల్ మీడియా వేదికల్లో చర్చిస్తున్నట్లు గుర్తించిన తర్వాత ఈ నలుగురు ఏటీఎస్ రాడార్ లో పడినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. చాట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ను విశ్లేషిస్తున్నట్లు గుజరాత్ ఏటిఎస్ పేర్కొంది. ఈ నలుగురు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు కలుసుకున్నారని.. ఢిల్లీకి చెందిన ఫైక్ పాకిస్తాన్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌తో పరిచయం పెంచుకున్నాడని, దేశంలో జిహాదీ కార్యకలాపాలను వ్యాప్తి చేయడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాడు అని గుజరాత్ ఎటిఎస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజి) సునీల్ జోషి మీడియాకు వివరించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్