జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ.. పాకిస్తాన్ భూభాగంలో ఆపరేషన్ సిందూర్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడితో పాకిస్తాన్ ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉగ్రవాద శిభిరాలను కోల్పోయింది. భారత్ సరిహద్దుల్లో పాక్ ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన స్థావరాలను ఇండియన్ ఆర్మీ రాత్రికి రాత్రే ధ్వంశం చేసింది. పాకిస్తాన్ తేరుకునేలోపే.. సరిహద్దుల వెంబడి పెద్ద ఎత్తున దాడుల జరిగాయి. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా అదే స్థాయిలో బదులు ఇచ్చే ప్రయత్నం చేసింది.
Also Read : భారత్ కు ట్రంప్.. అమెరికా రాయబారి కీలక ప్రకటన
ఇక ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ కు భారీ నష్టం వాటిలిన్నట్టు అంతర్జాతీయ మీడియా కూడా వెల్లడించింది. తాజాగా ఓ ఉగ్రవాద సంస్థ కమాండర్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేసాడు. బహావల్‌పూర్ లో ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జరిగిన దాడుల్లో ఉగ్రవాద దాడుల సూత్రధారి మసూద్ అజార్ కుటుంబాన్ని భారత దళాలు ముక్కలు చేసాయని జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) కమాండర్ అంగీకరించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, జెఎం కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ మే 7 నాటి దాడిని గుర్తుచేసుకుంటూ, భారత దళాలు తమ రహస్య స్థావరంపై ఎలా దాడి చేశాయో వివరించాడు.
Also Read : టీం ఇండియా కొత్త స్పాన్సర్ ఎవరంటే..?
ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేము ఢిల్లీ, కాబూల్ మరియు కాందహార్‌లతో పోరాడామని కామెంట్ చేసాడు. సర్వస్వం త్యాగం చేసిన తర్వాత, మే 7న, బహవల్‌పూర్ లో భారత దళాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయన్నాడు. 2000ల ప్రారంభంలో ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాది మసూద్ అజార్ స్థాపించిన జెఎం, గత రెండు దశాబ్దాలుగా భారత్ లో దాడులు చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో కూడా ఈ ఉగ్రవాద సంస్థ పాత్ర ఉన్నట్టుగా అనుమానిస్తున్నాయి భారత వర్గాలు. కాగా ఆపరేషన్ సిందూర్ దాడుల తర్వాత, పాకిస్తాన్ మీడియా.. మసూద్ అజార్ స్వయంగా తన కుటుంబ సభ్యులు 10 మంది బహవల్పూర్‌లో మరణించారని అంగీకరించినట్లు పేర్కొంది. వీరిలో అతని అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు.