ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉగ్రవాదుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మే నెలలో జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దర్యాప్తు బృందాలు ఉగ్రవాదుల నెట్వర్క్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాయి. ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ఉగ్రవాదం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు కూడా విస్తరించడం ఆందోళన కలిగించే అంశం. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ తో పాటుగా బెంగళూరులో ఉగ్రవాదుల కదలికలు కనపడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు చెన్నై తో పాటుగా కేరళ పేరు కూడా వినపడుతూ ఉంటుంది.
Also Read : రాజకీయాల్లోకి మరో వారసుడు.. కొడుకుని పరిచయం చేసిన కవితక్క
కానీ ఉత్తరాది రాష్ట్రాల తరహాలో ఉగ్రవాదుల దూకుడు దక్షిణాదిలో ఉండదు. గ్రామీణ ప్రాంతాలకు, చిన్నచిన్న పట్టణాలకు ఉగ్రవాదుల ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో ఉగ్రవాదులు కదలికలను ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు విజయవాడలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పూర్తిస్థాయిలో సాదాలు జరిపారు పోలీసులు. ఇక ఇప్పుడు సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు కలవరపెడుతున్నాయి. ఆయుధాలతో పాటుగా బాంబులు తయారు చేసే సామాగ్రి కూడా వాళ్ల వద్ద లభ్యం కావడం భయపెడుతోంది.
Also Read : బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంచలన మార్పులు..!
ఇటీవల ముగ్గురు ఉగ్రవాదులను వారి కుటుంబ సభ్యులను సత్యసాయి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జాతీయ దర్యాప్తు బృందం వారిని అదుపులోకి తీసుకుంది. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ధర్మవరంలో పట్టుబడిన ఉగ్రవాది నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారంతో.. తాజాగా మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. దుండగుల నుంచి సింగిల్ బ్యారెల్ రైఫిల్, పది బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జత్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ అలాం షేక్ లను అరెస్టు చేశారు. వీళ్లకు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లుగా తేల్చారు. వీరికి ఆర్థిక సహాయం కూడా అందుతున్నట్లు వెల్లడించారు.