Saturday, September 13, 2025 07:03 AM
Saturday, September 13, 2025 07:03 AM
roots

ఐపీఎల్ సీజన్ 18లో తెలుగు క్రికెటర్లు

ఐపీఎల్ సీజన్ 18లో తెలుగు కుర్రాళ్లు ఛాన్స్ కొట్టారు. ఇప్పటికే నలుగురు ఐపీఎల్‌కు ఎంపిక కాగా… ఇప్పుడు మరో ముగ్గురు ఆ లిస్ట్‌లో చేరారు. టాలెంట్ ఉంటే మారుమూల ఉన్నా గుర్తింపు దొరుకుతుందని క్రికెట్ నిపుణులు చెప్తున్నారు. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్… అనగానే క్రికెట్‌ ప్రేమికులకు పండగ. కేవలం 20 ఓవర్లలో భారీ సిక్సర్లతో ఆకట్టుకునే బ్యాట్స్‌మెన్స్‌, అద్భుత క్యాచ్‌లు పట్టే ఫీల్డర్లు, కళ్లు చెదిరే వికెట్లు తీసే బౌలర్లకు ఐపీఎల్ వేదికగా మారింది. ఇంతకుముందు రంజీ, ఇంటర్నేషనల్‌కు ఎంపిక కావాలంటే.. క్రికెటర్లకు తలకు మించిన భారంగా ఉండేది.

Also Read: మోడరన్ డే హీరో… ది బెస్ట్ డిఫెన్స్ టెక్నిక్

ఐపీఎల్ రావడం యువ క్రికెటర్లకు అందివచ్చిన మంచి అవకాశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న క్రికెటర్లకు ఐపీఎల్ 18లో అవకాశం దక్కింది. దీంతో, టాలెంట్ ఉంటే.. అవకాశం తన్నుకుంటూ వస్తుందనే భావన అందరిలోనూ వచ్చింది. ఇప్పటికే నితీష్ రెడ్డి, కేఎస్‌ భరత్, రికీ భూయ్, రషీద్.. ఐపీఎల్‌కు ఎంపిక కాగా.. మరో ముగ్గురు తెలుగు ఆటగాళ్లకు కూడా అవకాశం దక్కింది. విశాఖకు చెందిన పైలా అవినాష్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు, సత్యనారాయణ రాజు ముంబై ఇండియన్స్‌కి, ఢిల్లీ కేపిటల్స్‌కు విజయ్‌ ఎంపికయ్యారు. ఒకొక్కరికి రూ.30 లక్షలకు బిడ్డింగ్‌లో కోనుగోలు చేశారు. ఇప్పటికే వీళ్లంతా దేశవాళి టోర్నీల్లో తమ సత్తా చాటుతున్నారు.

Also Read: ఓపికతో దూకుడు… పెర్త్ లో భారత్ కు విజయావకాశాలు

ఇక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టులో మొదటి రోజు తెలుగు ఆటగాడు నితీష్‌కుమార్‌ రెడ్డి.. 41 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. నితీష్‌ పోరాడకపోయుంటే మ్యాచ్ చేజారేది. కానీ అరంగేట్ర టెస్ట్‌లోనే నితీష్‌ ఆకట్టుకున్నాడు. భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన తెలుగోడు.. ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. తన కుమారుడు ఐపీఎల్‌లో రాణిస్తుండంతో నితీష్‌ కుమార్‌ రెడ్డి తల్లిదండ్రులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి కష్టానికి తగ్గ ఫలితం దక్కిందంటున్నారు.

ప్రపంచంలో భారత్‌ను నెంబర్‌ వన్‌ స్థానంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఐపీఎల్‌లో ఎంపికైన తెలుగు కుర్రాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో అవకాశం ఇస్తే…. తెలుగు కుర్రాళ్లు సత్తా చాటడం ఖాయమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్