Friday, September 12, 2025 11:23 PM
Friday, September 12, 2025 11:23 PM
roots

తెలంగాణలో గేర్‌ మార్చిన కమలం పార్టీ…!

తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టాలని ప్రధాని మోదీ ఆదేశించిన నేపథ్యంలో.. వచ్చే ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎన్నికలతో పాటు 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కిషన్‌ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన వాటాల విషయంలో సీరియస్‌గా వర్కవుట్ చేస్తూనే పార్టీలో గ్రూప్ రాజకీయాలను ఇకపై ప్రోత్సహించకూడదని నిర్ణయించినట్లు సమాచారం. బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్‌, పాయల్ శంకర్‌, యేలేటి మహేశ్వర్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సత్యనారాయణ, కాటేపల్లి సత్యనారాయణ రెడ్డి, రాజాసింగ్, రామరావు పరివార్‌తో ఒకటి రెండు రోజుల్లో సమావేశం కానున్నారు.

Also Read : చంద్రబాబు వద్దకు చేరిన బూడిద పంచాయితీ

ప్రస్తుతం బీజేపీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎల్పీనేతగా ఉన్నారు. తెలంగాణలో ప్రజాసమస్యల మీద పోరాటం చేయాలన్న, ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టాలన్న ఎమ్మెల్యేలదే కీ రోల్. అయితే బీజేపీలో ఎల్పీ నేతకు పార్టీ అధ్యక్షుడికి మధ్య పొసగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఎంపీలతో కలిసి ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోవడం వల్లే.. పార్టీ అనుకున్న స్థాయిలో ప్రజలకు చేరువ కాలేకపోతుందని జాతీయ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాటు కొత్త అధ్యక్ష పదవి కూడా వర్గాలుగా విడిపోవడానికి కారణం అయిందన్న అపవాదు ఉంది. బీజేఎల్పీ లీడర్‌, రాష్ట్ర అధ్యక్షుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో క్యాడర్ కొంత అయోమయంలో ఉంది.

దీనికి తోడు ఈసారి అధ్యక్ష పదవి రేసులో బీసీ సామజిక వర్గం నుంచి ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌ రేసులో ఉన్నారు. నూతన బాస్ విషయంలో అధిష్టానానిదే ఫైనల్ నిర్ణయం అయినప్పటికీ రాష్ట్ర నాయకత్వం నుంచి కొంత మేరకు ఫీడ్ బ్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారుగా పార్టీ నిర్ణయాలపై ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ భారీగా ఓటు బ్యాంకు షేర్ సంపాదించుకున్నా.. అధికారంలోకి రావడంలో ఎందుకు వెనకబడుతుందో రాష్ట్ర నాయకత్వం ఆలోచించాలంటూ గతంలో ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు జాతీయ నేతల దృష్టి వరకు వెళ్లాయి.

Also Read : రాజకీయ శరణార్థిగా గుర్తించండి.. ప్రభాకర్ రావు సంచలన ట్విస్ట్

ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నేతలు అధ్యక్ష పదవి రేసులో ఉండటం కూడా పాత నేతలకు పొసగడం లేదన్న గుసగుసలు ఉన్నాయి. స్టేట్ లెవల్‌లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం నుంచి మద్దతు ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో రాజాసింగ్, ధర్మపురి అరవింద్ లాంటి నేతలు బహిరంగంగానే పార్టీ తీరుపై విమర్శలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్న బీజేపీ నేతలు.. ప్రధాని మోదీతో బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి బాటలో నడవక తప్పని పరిస్థితి నెలకొందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్