Tuesday, October 28, 2025 02:26 AM
Tuesday, October 28, 2025 02:26 AM
roots

టీం ఇండియా అండర్ రేటెడ్ క్రికెటర్

వైట్ బాల్ క్రికెట్ కు రెడ్ బాల్ క్రికెట్ కు చాలా తేడా ఉంటుంది. సిక్సులు కొట్టేసినంత ఈజీ కాదు టెస్ట్ క్రికెట్ లో గంటల తరబడి క్రీజ్ లో పాతుకుపోవడం అంటే. ఐపిఎల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యత తగ్గింది అనే మాట వినపడింది. క్రికెటర్ లు వైట్ బాల్ క్రికెట్ మీదనే ఎక్కువగా దృష్టి పెట్టారనే విమర్శలు సైతం వచ్చాయి. ముఖ్యంగా మన దేశంలో దీనిపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. కానీ కొందరు యువ క్రికెటర్లు మాత్రం టెస్ట్ క్రికెట్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టి కెరీర్ లో నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : బీఆర్ఎస్‌లో జూబ్లీహిల్స్ వార్..!

అందులో.. యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ఒకడు. టెస్ట్ క్రికెట్ లో అతనికి అవకాశం వచ్చిన ప్రతీసారి సత్తా చాటుతున్నాడు ఈ తమిళనాడు ఆటగాడు. 2021 తర్వాత ఇతని పేరు ఎక్కువగా వినపడింది. ఆస్ట్రేలియాలో మంచి ప్రదర్శన చేసిన తర్వాత క్రమంగా టెస్ట్ క్రికెట్ లో అవకాశాలు వచ్చాయి. తాజాగా జరుగుతోన్న ఇంగ్లాండ్ పర్యటనలో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు ఈ ఆల్ రౌండర్. ఏ స్థానంలో అయినా బ్యైంగ్ చేయగలిగే సత్తా ఉన్న సుందర్.. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో చేసిన బ్యాటింగ్ ఆకట్టుకుంది.

Also Read : అన్నతో సయోధ్య కుదిరినట్టే..?

103 బంతులు ఆడి 42 పరుగులు చేసిన సుందర్.. ఆడిన డిఫెన్స్ కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. లోయర్ ఆర్డర్ లో 30, 40 పరుగులు చేసినా.. వికెట్ కాపాడుకుని టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కు సహకరించినా.. అది ఎంతో ప్రభావం చూపుతుంది. గిల్ కు సుందర్ అలాగే సహకరించాడు. గిల్ డబుల్ సెంచరీ చేసినా.. పైన ఇంకో 69 పరుగులు చేసినా.. సుందర్ సహకారమే. సుందర్ క్రీజ్ లో ఉన్నంత సేపు కాన్ఫిడెంట్ గా కనపడిన గిల్.. ఆ తర్వాత తొందరపడ్డాడు. బౌలింగ్ లో కూడా ప్రభావం చూపించే సుందర్ కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు అభిమానులు. అవసరమైతే వేగంగా కూడా పరుగులు చేయగలిగే సామర్ధ్యం ఉన్న ఆటగాడు. అతనిని బ్యాటింగ్ లో మూడవ స్థానంలో పంపిస్తే మంచి ఫలితం ఉంటుందని, బ్యాటింగ్ లో బౌలింగ్ లో జట్టుకు బలంగా మారతాడు అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్