Monday, October 27, 2025 10:47 PM
Monday, October 27, 2025 10:47 PM
roots

నాగబాబుకు షాక్ తప్పదా..?

ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా.. ఆ పార్టీ కీలక నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధించడానికి ఎవరి సహకారం లేదని.. కేవలం జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ మాత్రమే అక్కడ పార్టీని గెలిపించారని.. ఇతరుల కృషి లేదంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ దీనిపై దుమ్మెత్తి పోసింది. ఈ తరుణంలో తాజాగా ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత.. పవన్ కళ్యాణ్ తో సీఎం చంద్రబాబు నాయుడు భేటి అయ్యారు.

Also Read: అసెంబ్లీలో ధూళిపాళ్ళ సంచలన డిమాండ్

క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ను తన క్యాబిన్ కు పిలిచారు చంద్రబాబు. ఈ సందర్భంగా నాగబాబు వ్యాఖ్యలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నాగబాబు దూకుడుగా మాట్లాడటాన్ని టిడిపి క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు విమర్శలు చేశారు. దీనితో ఇప్పుడు నాగబాబుకు క్యాబినెట్ పదవి లేదు అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. ఈ సమయంలో నాగబాబుని రాష్ట్ర క్యాబినెట్ లోకి తీసుకుంటే క్యాడర్ లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్న విషయాన్ని చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ కి వివరించినట్లు తెలుస్తుంది.

Also Read: వైసీపీ ఎమ్మెల్సీని ఆడుకున్న మంత్రులు

వాస్తవానికి మార్చి నెలలో నాగబాబు క్యాబినెట్లో అడుగు పెట్టాల్సి ఉంది. ఈ విషయాన్ని టిడిపి అధినేత గతంలోనే అధికారికంగా ప్రకటించారు. కానీ నాగబాబు వ్యాఖ్యల తర్వాత దీనిపై కూటమి పునరాలోచనలో పడింది అన్న వార్తలు వస్తున్నాయి. నాగబాబు గతంలో కూడా ఇదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు నాయుడు చర్చించినట్లు టిడిపి వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం కూటమిలో ఏ విధమైన ఇబ్బందికర వాతావరణం ఉన్నా సరే.. అది వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కూటమిలో ఉన్న నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంది. మరి భవిష్యత్తులో ఏ పరిణామాలు ఉంటాయో చూడాలి.

సంబంధిత కథనాలు

1 COMMENT

  1. అహంకార పూరితం గా నోరుపారెసుకున్న గత ప్రభుత్వ పెద్దలు ఇవ్వాళ ఎలా ఉన్నారో తెలుస్తోందిగా….ఎవ్వరైనా పరిస్థితులకి తలవొగ్గాల్సిందే….జనాలు రాజకీయ నాయకులని చాలా నిసితం గా దగ్గరగా గమనిస్తున్నారు….తస్మాత్ జాగ్రత్త గా ఉండాల్సిందే రాజకీయ నాయకులూ….

Comments are closed.

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్