Tuesday, October 28, 2025 06:59 AM
Tuesday, October 28, 2025 06:59 AM
roots

తులసిబాబుపై ప్రేమ.. ఎమ్మెల్యేపై అధిష్టానం సీరియస్…?

కొన్ని కొన్ని విషయాల్లో టిడిపి నేతలు ఎంత తక్కువ జోక్యం చేసుకుంటే అంత మంచిది. సున్నితమైన విషయాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో సందర్భాల్లో చాలా మంది నాయకులను హెచ్చరించారు. అనవసరంగా లేనిపోని విషయాల్లో పూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ప్రతి అంశాన్ని సున్నితంగా చూస్తున్నప్పుడు నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Also Read : రెడ్ బుక్ లో పేరున్నా.. కీలక పోస్టింగ్! సీఐ గారి హవా..!

తాజాగా గుడివాడకు చెందిన కామేపల్లి తులసి బాబును ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో ఈ విషయం తెలుసుకున్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హడావుడిగా స్టేషన్ వద్దకు వెళ్లారు. తులసి బాబుని ఎలాగైనా బయటికి తీసుకురావాలని నానా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించకపోవడంతో సైలెంట్ గా తిరిగి గుడివాడ వెళ్లిపోయారు. ఈ పరిణామం చూసిన జనాలు షాక్ అయ్యారు. ఎమ్మెల్యే అతిప్రేమ చూసి నివ్వెరపోయారు.

రఘురామకృష్ణం రాజును టార్గెట్ చేసిన ఒక వైసీపీ నాయకుడి కోసం వెనుగండ్ల రాము ఏ విధంగా వెళ్తారు అంటూ టిడిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. వైసీపీ నాయకులతో రహస్య స్నేహం చేయాలనుకుంటే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవాలని అంతేగాని ఇక్కడ ఉండి నాటకాలు ఆడొద్దు అంటూ ఫైర్ అయిపోయారు. అప్పట్లో కస్టోడియల్ టార్చర్ ఏ రేంజ్ లో మీడియాలో సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. సాక్షాత్తు ఒక ఎంపీ ని టార్చర్ చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది.

Also Read : అధ్యక్ష పదవి కోసం ఆ ఇద్దరి మధ్య పోటీ..!

అలాంటి వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులను కూడా అరెస్టు చేసినప్పుడు తులసి బాబును తప్పించాలి అని రాము ప్రయత్నం చేయడం చాలా మందిని విస్మయానికి గురి చేసింది. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం కూడా ఎమ్మెల్యే పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా రఘురాం కృష్ణంరాజు… తులసి బాబు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ లో తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ ఫైల్ చేశారు. తులసి బాబుకు బెయిల్ ఇవ్వొద్దు అని కోరారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్