Friday, September 12, 2025 11:44 PM
Friday, September 12, 2025 11:44 PM
roots

జగన్ గాలి తీస్తున్న పాత జీవో

వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్ మిర్చి ధర వ్యవహారాలలో తాజాగా అడ్డంగా దొరికిపోయారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడం లేదని వైసిపి ఆందోళనలు చేయాలని భావిస్తోంది. గతంలో ధరలకు ప్రస్తుత ధరలకు వాస్తవాలు చూస్తే వైసీపీ డ్రామాడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని టిడిపి ఆరోపిస్తోంది. వైసిపి ప్రభుత్వం హయాంలో మిర్చి కనీస మద్దతు ధర రూ 7000గా నిర్ణయించారు. ఈ మేరకు 2020 జనవరి 9న అధికారులు జీవోను జారీ చేశారు.

Also Read : జగన్ కామెంట్స్ తో డైలమాలో వైసీపీ సోషల్ మీడియా

ఈ జీవో ప్రకారం ధర పడిపోయినా.. అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఎం ఎస్ పీ కంటే ధరలు పడిపోతే ధరల స్థిరీకరణ నిధి కింద కొనుగోలు చేస్తామని నాటి ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. అయితే ధరల స్థిరీకరణ నిధులు పైసా కూడా లేదని అధికారులు స్పష్టం చేశారు. కనీసం మద్దతు ధర క్వింటాల్ రూ 7000 గా నిర్ణయించడంపై ఆనాడే జగన్ ప్రభుత్వ హయాంలోనే రైతులు, అలాగే విపక్షాల పార్టీల నేతలు నిరసనలకు దిగారు.

Also Read : టీటీడీ బోర్డు మెంబర్ బూ*తు పురాణం..!

నాడు చేసిన నిర్వాహకాలు మర్చిపోయి మళ్ళీ రైతులకు పరామర్శలు చేయడంపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇక తాజాగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సరే వైయస్ జగన్ మిర్చి యార్డుకు వెళ్లారు. దీనిపై టిడిపి నేతలు ఇప్పటికే జగన్ వ్యవహార శైలి పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మాత్రం అక్కడ జగన్ ఎటువంటి ప్రసంగాలు చేయడం లేదని… అలాంటప్పుడు ఆయన అక్కడికి వెళ్తే తప్పేంటి అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇక గుంటూరు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకుండా జగన్ మిర్చి యార్డ్ లోకి వెళ్లి రైతులను కలవడం కోసమెరుపు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్