Sunday, November 29, 2026 06:37 AM
Sunday, November 29, 2026 06:37 AM

టీడీపీ ఎమ్మెల్యే ఆడియో లీక్‌.. ఎందుకు ఈ నోటి దూల..?

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వ్యవహారశైలి మరోసారి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు విజయం సాధించిన నేపథ్యంలో, ఎన్నికల అధికారిగా విధులు నిర్వర్తించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాంతరాజుకు ఎమ్మెల్యే ఫోన్ చేసి తీవ్ర పదజాలంతో హెచ్చరించినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతోంది. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించలేదంటూ అసహనం వ్యక్తం చేయడంతో పాటు,

Also Read : ఎన్డీఏకు జగన్ అండ.. కానీ ఒక కండీషన్..!

సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే పరిటాల సునీతపైనా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆ సంభాషణలో వినిపించడం స్థానికంగా పెను దుమారానికి కారణమైంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అమిలినేని సురేంద్ర బాబు ఇటీవల కాలంలో పదే పదే వివాదాలతో వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. గత ఏప్రిల్ నెలలో అన్నమయ్య జిల్లా గండబోయినపల్లె టోల్‌ప్లాజా వద్ద సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారనే ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

Also Read : కేంద్రానికి షాక్ ఇచ్చిన డీఎంకే.. చంద్రబాబు రాయబారం ఫలిస్తుందా..?

అంతకుముందు ఏఆర్ కానిస్టేబుల్ దంపతులపై వర్గీయుల దాడి ఆరోపణలు, ఈ-స్టాంప్ వ్యవహారాల్లో అక్రమాల విమర్శలు, ఇటీవల కౌంటింగ్ కేంద్రం వద్ద బౌన్సర్ల గొడవ వంటి వరుస ఘటనలు ఆయనకు తలనొప్పిగా మారాయి. ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించామని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న ఇలాంటి పరిణామాలు ఆయన రాజకీయ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని దూషించారనే ఆరోపణలతో ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఈ ఆడియోను ఆయుధంగా చేసుకుని విమర్శల దాడిని పెంచింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

హరీష్ దెబ్బ మామూలుగా...

హైదరాబాద్‌లో ఎకరం భూమి ధర వంద...

రిషికొండ ప్యాలెస్‌ పై...

విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల...

ఢిల్లీ రాజకీయాలపై చంద్రబాబు...

కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు రంగం...

ఇంద్రకీలాద్రిపై ఆగని ఇంటిదొంగల...

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుస...

ముంబై బాస్‌ మళ్లీ...

ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు మరోసారి...

కేంద్రానికి షాక్ ఇచ్చిన...

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రంలోని ఎన్డీఏ...

పోల్స్