Wednesday, October 22, 2025 02:04 AM
Wednesday, October 22, 2025 02:04 AM
roots

మర్రి రాకతో గుబులు మొదలైందా..?

మర్రి రాకతో గుబులు మొదలైందా.. ఇప్పుడు ఇదే ప్రశ్న టీడీపీలో హాట్ టాపిక్. మర్రి రాక ఏమిటి.. ఎవరికి గుబులు మొదలైంది.. అని అంతా చర్చించుకుంటున్నారు కూడా. వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. నాలుగు నెలల తర్వాత సైలెంట్‌గా తెలుగుదేశం పార్టీలో చేరారు. మర్రి రాజశేఖర్‌తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Also Read : సంచలనం.. తిరుమలలో మరో అపచారం బహిర్గతం

స్వయంగా పార్టీ అధినేత కండువా కప్పిన తర్వాత ఇంక మాట్లాడే ధైర్యం ఎవరికి ఉంటుంది.. కానీ ఇప్పుడు మర్రి రాజశేఖర్ టీడీపీలోకి రావటాన్ని చిలకలూరిపేట నియోజకవర్గం కొందరు టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఒకరిద్దరు అయితే బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి మాకు కనీస సమాచారం ఇవ్వలేదు.. మిమ్మల్ని కనీసం సంప్రదించలేదు. ఎలా చేర్చుకుంటారు.. మిమ్మల్ని పార్టీ కనీసం గుర్తించడం లేదంటూ మీడియా ముందు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు.

Also Read : ఆస్కార్ రేస్ లో ఇండియన్ సినిమాలు ఇవే.. తెలుగులో ఏ సినిమా అంటే..?

వాస్తవానికి మర్రి రాజశేఖర్‌ పార్టీ మార్పు వెనుక పెద్ద కథే ఉంది. మర్రిని కాదని వైసీపీ అధినేత మాజీ మంత్రి విడదల రజనీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో రజనీపై ఆరోపణల నేపథ్యంలో నియోజకవర్గం మార్చినప్పటికీ.. ఎన్నికల తర్వాత మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీ బాధ్యతలను రజనీకే అప్పగించారు. దీంతో మరో నాలుగేళ్లు ఎమ్మెల్సీగా పదవి ఉన్నా కూడా తీవ్ర మనస్థాపంతో ఆ పదవికి, వైసీపీకి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు.

 

మర్రి రాజశేఖర్‌కు చిలకలూరిపేటలో మంచి పేరున్న మాట వాస్తవం. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచిన మర్రి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. పార్టీలకు అతీతంగా పనులు చేశారనే పేరు సంపాదించారు. మర్రి రాజశేఖర్‌కు చిలకలూరిపేట నియోజకవర్గంలో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. దీంతో మర్రితో స్వయంగా చర్చలు జరిపిన నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు.. చంద్రబాబుతో చర్చించి టీడీపీలో ఎంట్రీకి మార్గం సుగమం చేసినట్లు సమాచారం. అందుకే మర్రి రాజశేఖర్ పార్టీ మారుతున్న సమయంలో ఎంపీ లావు కూడా పక్కనే ఉన్నారు.

 

మరోవైపు మర్రి రాకతో తమకు బ్రేక్ పడుతుందనేది మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గం మాట. గతంలో మంత్రిగా ఉన్నప్పుడే పుల్లారావుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై చంద్రబాబు స్వయంగా మందలించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి కూడా. అందుకే 2019 ఎన్నికల్లో పుల్లారావు ఓడిపోయారనేది బహిరంగ రహస్యం. ప్రస్తుత ఎన్నికల్లో పుల్లారావు గెలిచినా కూడా.. మంత్రిపదవి ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం అవినీతి ఆరోపణలే.

 

ప్రస్తుతం చిలకలూరిపేట పట్టణంలో ఓ షాపింగ్ మాల్ విషయంలో ప్రత్తిపాటి పుల్లారావుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఎన్నారై నిర్మించిన షాపింగ్ మాల్‌ను కబ్జా చేసేందుకు పుల్లారావు యత్నించారనేది ప్రధాన ఆరోపణ. ఈ వివాదంపై సదరు యజమాని కోర్టుకు కూడా వెళ్లారు. టీడీపీ సానుభూతిపరుడే అయినప్పటికీ.. పుల్లారావు దెబ్బకు ఇప్పుడు పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు. పుల్లారావు మనుషులు చేస్తున్న దాడులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూనే ఉన్నారు.

 

రాబోయే ఎన్నికల్లో పుల్లారావు పోటీ చేసేది లేదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ నేత కోసం పార్టీ వేట ప్రారంభించింది. పుల్లారావు మాత్రం తన తర్వాత తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తారని చెబుతున్నారు. కానీ పార్టీ మాత్రం నో ఛాన్స్ అంటోంది. అందుకే పుల్లారావుకు ప్రత్యామ్నాయంగా మర్రి రాజశేఖర్‌కు టీకెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే మర్రి పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నియోజకవర్గంలో వినిపిస్తోంది. మర్రి రాకతో తమ రాజకీయ భవిష్యత్తుకు పునాది పడుతుందనే భయంతోనే ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్‌లు పెట్టించి… పార్టీ అధినేత తప్పుడు నిర్ణయం తీసుకున్నారని.. అధినేతనే ఎదిరించేలా వ్యాఖ్యలు చేయిస్తున్నారనేది బహిరంగ రహస్యం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్